Others

వెబ్ స్క్రీన్‌కు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియా బెనర్జీ గుర్తుందిగా. నారా రోహిత్‌తో ‘అసుర’లో నటించి అలరించిన బెంగాలీ బ్యూటీ. అందమంతా స్క్రీన్‌మీద పిండివంటలా వడ్డించినా -టాలీవుడ్‌లో మాత్రం కెరీర్‌కు పనికొచ్చే పాత్ర ఒక్కటీ దక్కలేదు. దీంతో బిగ్ స్క్రీన్ ఆశలు వదిలేసి -వెబ్ స్క్రీన్‌పై వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోడానికి రెడీ అయ్యింది. రానా దగ్గుబాటి పక్కన వెబ్ సిరీస్‌లో కనిపించబోతోందట ఈ బెంగాలీ బ్యూటీ. ‘సోషల్’ పేరిట వస్తున్న వెబ్ సీరీస్‌లో నటించడానికి రానా అంగీకరించిన విషయం తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో రూపొందే సిరీస్‌లో ప్రియాని రానా సరసన ఎంపిక చేశార్ట. ‘సోషల్ కానె్సప్ట్‌తో వస్తున్న వెబ్ సిరీస్‌లో కనిపించబోతున్నా. ఇంటర్నెట్‌కు సంబంధించిన ఓ సమస్యను యువతి ఎలా ఎదుర్కొంది? అనేది ఆసక్తికరంగా సాగే పాత్ర నాది’ అంటోంది ప్రియా. శశి దర్శకత్వంలో వెబ్ సిరీస్ రూపొందుతోంది.