Others

బొప్పాయతో బోలెడన్ని లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొప్పాయిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బొప్పాయిని రోజు అరకప్పు తీసుకోవడం ద్వారా దాంపత్య జీవితం మెరుగ్గా వుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీర్యంలో నాణ్యతను పెంచడంతో పాటు బొప్పాయిలోని ఎంజైమ్ అని పిలువబడే అర్జినిని..మర్మాంగాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా కండరాల పనితీరు మెరుగవుతుంది. అలాగే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండడం ద్వారా నిత్య యవ్వనులుగా కనిపిస్తారు. ఇందులోని విటమిన్ సి, విటమిన్ ఇ ముఖంపై వుండే ముడతలను దూరం చేస్తుంది.
చర్మాన్ని మృదువుగా వుంచుతుంది. శిరోజాలకు మేలు చేస్తుంది. చుండ్రును దూరం చేస్తుంది. బొప్పాయితో ఎయిర్ మాస్క్ ఉపయోగించడం ద్వారా జుట్టు బలంగా వుంటాయి. వంద గ్రాముల బొప్పాయి గుజ్జు, వంద గ్రాముల అరటి గుజ్జు, వంద గ్రాముల పెరగు, ఒక స్పూన్ కొబ్బరి నూనెను చేర్చి పేస్టులా చేసుకుని జుట్టుకు, మాడుకు రాయడం ద్వారా చుండ్రు తొలగిపోతుంది. జుట్టు మృదువుగా వుంటుంది.
ఇక బొప్పాయిని తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇందులోని పోషకాలు బరువును తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తాయి. అలాగే మతిమరుపుకు కూడా బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను బొప్పాయి దూరంచేస్తుంది.ఇందులోని విటమిన్ ఎ, సి వ్యాధినిరోధక శక్తి పెంచేలా చేస్తుంది. తద్వారా తరచు వేదించే జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు నయం అవుతాయి.