Others

ధర్మాధర్మవిచక్షణశీల ద్రౌపది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు బాండు భూ
వరునకు గోడలైతి జనవంద్యుల బొందితి , నీతి విక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్ , సహజన్ముల ప్రాపు గాంచితిన్
సరసిజనాభ! యిన్ని ట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్... అని సగర్వంగా మహాభారత ఉద్యోగపర్వంలో చెప్పుకున్న ద్రౌపది నాటికి నేటికి ఆదర్శవనిత.
ద్రౌపది మహాభారతంలో మనకు పట్టువీడని పడతిగా పైకి కనిపిస్తుంది. కాని, ఆమె - అత్యంత అరుదైన సౌందర్యరాశి,సద్గుణశీల, సూక్ష్మగ్రాహి, సహనశీలి, చమత్కారి, అభిమానవతి, పౌరుషంతో కూడిన నీతి గల్గినది. అధర్మం పాలిట కాళరాత్రి. ధర్మాధర్మ విచక్షణశీల .్ధర్మసంస్థాపనకు మార్గదర్శి, క్షమయే ద్రౌపది. మహాభారత సంగ్రామానికి కారణభూతి. నారీలోకానికి శిరోమణి, గృహస్థ్ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం, భర్తల అనురాగం పొందటంలో అద్వితీయ. ఇచ్ఛా జ్ఞాన క్రియారూపమైన త్రివిధ శక్తుల సమాహారం ద్రౌపది. తిక్కన మహాకవి గంటమనే ఉలి చెక్కిన స్ర్తిశక్తిస్వరూపిణీ రూపం ద్రౌపది. ఇంతటి మహాఖ్యాతి పొందిన వినయగుణశీల ద్రౌపది పంచభర్తృక.
ద్రుపద మహారాజు చేసిన యాగ కుండంనుంచి ఉద్భవించిన ద్రుపద పుత్రిక. యజ్ఞం నుంచి ఉద్భవించింది కనుక యాజ్ఞసేని అన్న పిలువబడింది. విజ్ఞాన ఖని. ఎంతటి ఆపదలు చుట్టిముట్టినా బీరువోని ధీరవనితామణి. ఆఖరికి తన తనయులు ఐదుగురిని కోల్పోయినప్పుడూ అశ్వత్థామ ను పట్టి తెమ్మని ఎంత ప్రోత్సహించి తన భర్తలను పంపించిందో అంతటి క్షమతో తన హృదయం అనుభవిస్తున్న వేదనను మరొక స్ర్తి అనుభవించకూడదు వీడిని పరాభవించి వదిలేయండి . ఇతని తల్లికి కడుపుశోకాన్ని కలిగించకండి అన్న ద్రౌపది క్షమయా ధరిత్రి భూదేవి కన్నా ఓర్పుకలిగిన ఇల్లాలుగానే మనకు కళ్లముందు కదలాడుతుంది. కృష్ణరూపుతో ఉన్నది కనుక కృష్ణ అని పిలుపబడినది.
అటువంటి ద్రౌపది నానాకష్టాలనే కడలిని తన వ్యక్తిత్వమనే తెడ్డును పట్టుకుని గట్టుచేరుకుంది. పాండవులందరికన్నా ముందే స్వర్గసీమను అలంకరించిన ధీర వనితామణి ద్రౌపది.
సౌందర్యానికి పర్యాయపదం స్ర్తి. కాని ఆ సౌందర్యమే ఆమె పాలిట ఎల్లవేళలా పరమశత్రువుగా నిలుస్తోంది నేటికీ. మాయాజూదంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అరణ్యఅజ్ఞాత వాసాలు అనుభవిస్తూ విరటుని కొల్వులో ఉన్న పాండవులకు కష్టాలు మాత్రం వెన్నంటే ఉన్నాయి. అందులోనుద్రౌపదికి మరింత ఎక్కువే. ఆమె సౌశీల్యం, స్వాభిమానం గల పడతి అయినా, ఎన్నటికీ దూరంగాని ధైర్యంతో విలసిల్లినా కాని కీచకుని కంట పడనే పడింది. ఆ కీచకుని ఎన్నోవిధాలుగా నయాన భయాన తన్ను కోరవద్దని చెప్పిందిసైరంధ్రి. అయినా వినని కీచకుడితో తన భర్తలు
‘‘దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప పస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్....’’అంటూ అతివీర భయంకర భుజబల సంపన్నులు నా భర్తలు అని భయపెట్టింది కాని, కామంతో కన్నుమూసుకున్నవాడి ముందు మాట్లాడే మాటలు కేవలం చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే కదా. అందుకే ఆ దుర్మార్గ కీచకుడిని వలలుడిగా భీముడు అతి భయంకరంగానే కాదు జుగుస్స కలిగేట్లుగా మర్థించాడు. నేటి కీచకులు కూడా ఆ కీచకుణ్ణి ఒకసారి స్మరిస్తే చాలు అడుగు ముందుకేయలేరు. కాని వీరుకూడా కబంధులైన కాముకులే కదా.
కీచకుని చెరలో ఉన్న దౌప్రది కాస్త వెఱపన్నది లేకుండా ఎలా మాట్లాడిందో ఎలా వాని నుంచి తప్పించుకుందో అట్లానే వాడిని మట్టుపెట్టడంలోనూ వలలుడి ప్రేరణగా నిలిచింది.
ఆ ద్రౌపదే దుష్టచతుష్ట దౌర్జన్యానికి బలియైన వేళ నిండుసభలో జూదంలో ఓడి పోయి తలలు వంచుకున్న భర్తల యెదుట ధర్మానికి నిలువెత్తు సాక్షంగా ఉన్న ద్రోణ, కృప, భీష్మాదులున్న ద్రుతరాష్ట్రుని కొలువులో తన్ను వోడి నన్నోడినా.. లేక నన్నోడి తాను ఓడినా అని ముందుగా తన పతుల జూదరి తనాన్ని ఎండగట్టింది.

- రాయసం లక్ష్మి 9703344804