Others

జల ప్రక్షాళన అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతిని దైవంగా ఆరాధించే భారతావనిలో జీవజలాలు నానాటికీ నిర్జీవమైపోతున్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు ఆధారమైన జల సంపద కలుషితమై పోతోంది. అభివృద్ధి పేరిట, ఆధునిక జీవనం పేరిట మనం సృష్టిస్తున్న కాలుష్యం- పవిత్ర జలాలుగా మనం నెత్తిన జ ల్లుకుని ప్రణతులు అర్పించే జలదేవతల ఊపిరి హరింపచేస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా తల ఎత్తుకుని తిరిగే అధినేతలు ఈ విపత్కర దుర్గతికి దైవాధీనం అంటూ ఎంతగా మసిపూసినా, వాస్తవ స్థితిగతులు సిగ్గుతో తల దించుకునేట్టు చేస్తున్నాయి.
ఉత్తర భారతంలో శ్రీకృష్ణపరమాత్మ దివ్యావతార మహత్మ్యంతో ప్రత్యక్ష తాదాత్మ్యత కలిగిన నది ‘యమున’ ఏనాడో మృతప్రాయం కాగా, పవిత్ర గంగానది మరణ శయ్యపై ఉక్కిరి బిక్కిరవుతోంది. పర్యావరణాన్ని రక్షించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ, చట్టాలను పట్టించుకోకుండా నిస్సిగ్గుగా కా ర్పొరేట్ యాజమాన్యాలకు కాల్మొక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ‘గలగల గోదారి’, ‘బిర బిరా కృష్ణమ్మ’ పారిశ్రామిక కాలుష్యపుకోరల్లో చిక్కుకున్నాయి. మహానగరాల ప్రతిష్టాత్మక నిర్మాణాలతో, విశ్వనగర నిర్మాతలుగా చరిత్రలో నిలిచిపోవాలని కలలు కంటున్న రాష్ట్ధ్రానేతలు ఈ మహా కాలుష్యం ఏ గంగలో కలుస్తుందో పట్టించుకునే విజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారు.
ఆధ్యాత్మిక సద్గురువులు నిరంతరం మానవాళి జీవన సౌభాగ్యాన్ని, సా మాజిక కల్యాణాన్ని అభిలషిస్తారు. అశేష భక్తజనావళిని సక్రమ మా ర్గంలో నడిపించే శక్తి వారికి వుంది. రాజకీయ అధికారం కంటే, సద్గురువుల ప్రభావమే సమాజంలో ఎక్కువగా కనపడుతోంది. షిరిడీ సాయి, సత్యసాయి వంటి మహాత్ములు ఐహికంగా, ఆముష్కికంగా ఎంతో ప్రభావితం చేశారు. చరిత్ర పుటలను పరిశీలిస్తే రాజ్యాధికారంతో సరిసమానంగా రాజగురువుల ఆధిపత్యం ఉండేది. ప్రస్తుత కాలమానం అనుసరించి, భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మతానికి అతీతమైన వ్యవస్థను ప్రసాదించడంతో ఆధ్యాత్మిక మహోన్నతులు అయిన సద్గురు పరంపర- మతాధిక్య, ఆస్తిక జీవన సరళి ప్రబోధిస్తూ మతం ఏదైనా జనం శాంతి సుఖాలతో జీవింపచేసే జీవన విధానానికి ప్రోత్సాహం మార్గదర్శకం చేస్తోంది. ప్రకృతి రమణీయతకు, సకల దేవతా మూర్తుల ఆత్మలకు నిలయమైన నగాధిరాజు హిమాలయ పర్వతోన్నత శిఖరాల నుంచి జాలువారుతున్న జీవనదుల పవిత్ర జలాలు, భక్తకోటికి ఆరాధ్యనీయం. హిమాలయాల ఒడిలో జీవన్ముక్తి సాధించే ధర్మదీక్షాపరులైన యోగి పుంగవులు, ఆధ్యాత్మిక సద్గురువులు గంగానది మృత ప్రాయంగా మారడం పట్ల, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శాంతియుత ఉద్యమ ఆందోళనలు, నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
గంగానది తీర ప్రాంతాలలోని ఆశ్రమాధిపతులైన సాధు సత్పురుషులు మైనింగ్ మాఫియాను ఎదుర్కొన్న వైఫల్య అనుభవాలున్నాయి. ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద, హరిద్వార్ మాత్ససదన్ స్వామీజీలు శివానంద, గోకులానంద, నిఖిలానంద, నిగమానంద, గంగోత్రి స్వామీజీ సుందరానంద, గంగాస్వామి సేవా అభియాన్ జ్ఞాన స్వరూప్ సనంద్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖను న్యాయపోరాటాలతో నిలదీస్తున్నారు. ఆధ్యాత్మిక యోగి, హరిద్వార్ మైత్రీ సదన్ ఆశ్రమ వాసి స్వామి నిగమానంద (36) గంగాతీరంలో అక్రమ గనుల తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ 115 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి 2011 జూన్ 13న స్వచ్ఛంద మరణాన్ని ఆహ్వానించారు. గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వరకు 135 కిలోమీటర్ల ప్రాంతాన్ని 2010లో కేంద్రప్రభుత్వం ‘ఎకో సెన్సిటివ్ జోన్’గా ప్రకటించినా సజీవ నదీ జలసంపదను నగర, పారిశ్రామిక, మైనింగ్, అడవుల నరికివేత కబళిస్తోంది. పర్యావరణ శాస్తజ్ఞ్రులు జి.డి.అగర్వాల్, ఉద్యమనేతలు వందనా శివ, న్యాయవాదులు ఎంసీ మెహతా వంటివారు 1985లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకపక్క విపరీతంగా పెరుగుతున్న జనాభా జీవనావసరాలు, అధునాతన జీవన శైలికి అత్యంత ప్రధానమైన విద్యుదుత్పత్తి పేరిట ప్రకృతి వనరులను కొల్లగొట్టే ప్రభుత్వాలు గంగను రక్షించలేక నిస్సహాయం అవుతున్నాయి.
‘పవిత్ర భారతావనిలోని ఈ నదీ జలసంపద, భూమి వేలాది సంవత్సరాలుగా మనకు జీవనాధారంగా బతుకునిస్తోంది. రానున్న రెండు తరాలలో మనం ఈ ప్రకృతి వనరులను పూర్తిగా ధ్వంసం చేసుకుని భయంకర ఎడారులు సృష్టించుకోనున్నాం. నిజంగా ఈ విషమ సమస్యను పరిష్కరించుకోవాలంటే ప్రభుత్వ స్థాయిలో విధాన నిర్ణయాలలో మార్పు అత్యవసరం. మన కార్యాచరణ, ఆలోచనలు నదీ జలసంపదను ఇంక దోచుకోవడం మీద కాకుండా పునరుజ్జీవనంపై ధ్యాస కేంద్రీకరించాలి. దేశంలోని ప్రతి ఒక్కరూ తక్షణ కార్యాచరణకు నిమగ్నమయ్యే కర్తవ్యం చేపట్టాలి. దేశమంతటా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపుతో- మృతప్రాయమవుతున్న నదులను రక్షించి ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలనే సత్సంకల్పానికి లక్షలాదిగా జనం ర్యాలీలు, శపథాలతో నాంది పలికారు. నదులను మళ్లీ జీవనదీ ప్రవాహాలుగా పునరుజ్జీవింప చేయడానికి, తమ సమ్మతిగా సెల్‌ఫోన్లలో ‘మిస్సెడ్ కాల్స్’ ప్రతిధ్వనిస్తున్నాయి. ‘ర్యాలీ ఫర్ రివర్స్’తో యువతరం, విద్యార్థి లోకం నడుం కట్టారు. సెప్టెంబర్ 3నుంచి అక్టోబర్ 2 దేశంలోని 16 రాష్ట్రాల్లో 30 నదీ తీరాలు జగ్గీవాసుదేవ్ నినాదంతో మారుమోగనున్నాయి.
సుప్రీం కోర్టు నదులు సజీవ జీవాలుగా హక్కులు ప్రసాదించే నిర్ణయం భారత జాతికి శిరోధార్యమైంది. జాతిపిత గాంధీజీ 150వ జయంతి సందర్భంగా 2019వ సంవత్సరం లోగా గంగానదిని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ పరిపాలనా బాధ్యతను నిర్వర్తించిన యుపిఎకు కేవలం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా జలకాలుష్య నివారణ బాధ్యతగా వుండేది. భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వానికి పర్యావరణంతోపాటు హిందుత్వ ఆరాధనకు అత్యంత కీలమైన గంగామాతను సంరక్షించుకునే లక్ష్యం ఉంది. మనదేశంలో సుమారుగా రెండు లక్షల కిలోమీటర్ల పొడువున 400 నదులున్నాయి. 14 పెద్దనదులే కాక జలవనరులన్నీ కాలుష్య కాసారాలుగా దోసిళ్లతో తాగడం కాదు చేతితో తాకడానికి కూడా భయపడాల్సిన కాలుష్యంతో విషపూరితమవుతున్నాయి. కాగా, వినాయక విగ్రహాల నిమజ్జనాలతో జలవనరులను కాలుష్యవంతం చేయరాదన్న ధ్యాస ఇపుడు జనంలో పెరగడం శుభసూచకం.

-జయసూర్య