Others

వ్యాకరణానికి మూలం పాణిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాణిని బహుముఖ ప్రజ్ఞాశాలి. సంస్కృత భాషను చక్కగా తీర్చిదిద్దిన అసామాన్య ప్రతిభావేత్త. వ్యాకరణం, వేదాంగం, వేదాలలోని భాగాలు అక్షరాల ఉచ్ఛారణను నిర్ధారిస్తుంది. పాణిని మహా పండితుడు. ఇతడు క్రీపూ 7వ శతాబ్దానికి చెందినవాడుగా ఆధారాలు లభించాయి. పాకిస్తాన్‌లో ప్రవహించే సింధూనది ఒడ్డున వున్న నేటి లాహోర్ పట్టణాన్ని పూర్వం ‘శలాతుర’ అని వ్యవహరించేవారు. ఆ శలాతురయే పాణిని యొక్క జన్మస్థలం. పాణిని అనునది ఆయన గోత్రం పేరు.
ఈయన తండ్రి పేరు పణని. పణనియే వాడుకలో పాణిని అయ్యాడని ప్రతీతి. కాని వాస్తవానికి ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అహికుడు. పాణినికి శాలాతురీయుడు, శాలంకి, దాక్షీపుత్రుడు అని కూడా పేర్లు కలవు.
పాణిని సంస్కృత భాషకు ‘అష్ట్ధ్యాయి’ అనే వ్యాకరణం రాశాడు. ఇందులో ఎనిమిది అధ్యాయాలున్నాయి. కావున అష్ట్ధ్యాయి అని పేరుగాంచింది. పాణినికి పూర్వం వున్న సంస్కృత భాషను వైదిక వాఙ్మయ మంటారు. పాణిని వలన సంస్కరింపబడిన భాష కావున ఆర్య భాష సంస్కృత భాషగా వాడుకలోకి వచ్చింది.
పాణిని ఏర్పరిచిన నియమాలతో సంస్కరింపబడిన భాషను లౌకిక వాఙ్మయముగా పరిగణించారు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు అనునది మూడు భాషలలోని ముఖ్య భాగాలు. అనంత పాండిత్యము, పరిశీలన, పరిశోధనలతో అష్ట్ధ్యాయిని రచించాడు. దీనికే పాణినీయం అని కూడా అంటారు. పాణినికి ముందు రాసిన వ్యాకరణాలు భాషను పెద్దగా సంస్కరింపలేదు. ఈ వ్యాకరణాలన్నీ పాణిని ఎంతో శ్రద్ధతో చక్కగా అవగతం చేసుకుని అనంతమైన పరిశ్రమతో సూత్రరూపంలో గ్రంథస్తం చేసాడు. సుమారు 400 సూత్రాలతో సూత్ర విధానాన్ని నిర్వచించి విశదం చేసాడు.
‘అల్పాక్షరం-అసందిగ్ధం! సారవత్ విశ్వతోముఖం అస్త్భో మన వద్యంచ సూత్రం సూత్ర విదోవిదుః’ అని ముందుగా అక్షరాలను వివరించాడు. వాటి స్థానాలను కూడా చక్కగా తెలియజేసాడు. వాటి ఉచ్ఛారణకు కావాల్సిన ప్రత్యేక నియమాలను ఏర్పరిచి సంధులు మొదలైన వాటిని వివరించాడు. ఇది లోకంలో ఎంతో ఆదరణ పొందింది పాణిని వ్యాకరణాన్ని రాజులు, మహారాజులు ఎంతోమంది మెచ్చుకుని ఆదరించి గౌరవించారు. ఆ కాలంలో కొందరు రాజులు అష్ట్ధ్యాయినిని కంఠస్తం చేసిన వారికి వేయి దీనారాలు కూడా బహూకరించి గౌరవించారు. ఇది ఎంతోమందికి ప్రోత్సాహాన్ని ఇచ్చి అష్ట్ధ్యాయిని ఒక ఆదర్శ గ్రంథంగా పరిగణించబడింది. ఇది అత్యంత జనాదరణ పొంది అనేకమంది పండితులచే కీర్తించబడింది. ఎంతోమంది పాణినికి శిష్యులై ప్రసిద్ధిగాంచారు.
పాఠకుల యోగ్యతాయోగ్యతలను పాణిని ఎంతో చక్కగా వివరించాడు. ఆయన సూచనల్లో అతి ముఖ్యమైనవి ఏవనగా సంగీతం చదవద్దు చక్కగా పాడాలి అని ఉద్బోధించాడు. తర్వాత వేదాన్ని వినాలి కాని రాసుకుని చదవగూడదు. ముఖ్యంగా వేదాన్ని కీచుగొంతుతో బొంగురు గొంతుతో అసలే చదవగూడదని హితోపదేశం చేసాడు. అలా చేసినవారు అయోగ్యులవుతారని పాఠకుల యోగ్యతను ఎంతో చక్కగా తెలియజేసాడు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పాణిని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అందువలనే పాణిని ఆనాటికీ ఈనాటికీ భారతీయులందరికీ ఆరాధ్యుడై అలరారుతున్నాడు.

-పెండెం శ్రీ్ధర్