Others

కలతల కెరటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నదిలో అలలు ఎంత సహజమో సంసారంలో కలతలు కూడా అంతే సహజం. అల ఎంత ఎగిరిపడినా నదిని విడిచి ఉండలేదు. అదేవిధంగా భార్యాభర్తలిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంతోపాటుగా ఒకర్ని ఒకరు పరస్పరం గౌరవించుకోవాలి. ఆధిపత్యం కోసం గొడవలు పడకుండా ఇద్దరిలో సహనం ఉండాలి. ఒకరు కోపంతో ఉన్నపుడు మరొకరు శాంతంగా వుండాలి. అప్పుడే ఆ సంసారం ముందుకు సాగుతుంది. సంసారంలో ఎంతటి తీవ్ర స్థాయిలో కలతలు చోటుచేసుకున్నా భార్యాభర్తల బంధం విచ్ఛిన్నం కాకూడదు. వ్యక్తిగత విషయాలలో పరాయి వ్యక్తులకు తావివ్వకూడదు. భార్యాభర్తలు సరసాలు, చమత్కారాలకు దగ్గరగా ఉంటూ చిరాకులు, పరాకులకు దూరంగా ఉండాలి. ఇద్దరిమధ్య ప్రేమ అనేది లేకుంటే భవిష్యత్తు శూన్యమై జీవితం అంధకారమవుతుంది. భర్తతో ఆనందంగా జీవించాలంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. భార్యతో సుఖంగా జీవించాలంటే ఆమెను ప్రేమగా చూసుకోవడం అవసరం.
దంపతులమధ్య కలహాలు నీటిలో కెరటాల్లాంటివి. అవి అలా వచ్చి ఇలా పోతుంటాయి. అపుడప్పుడు చిన్న చిన్న కలహాలు వస్తేనే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటే వాళ్ళ అనుబంధం మరింత ధృడపడి ఏ అరమరికలకు తావులేకుండా అన్యోన్యంగా ఉంటారు. అయితే భార్యాభర్తలమధ్య వచ్చే గొడవలు ఆరోగ్యకరంగా ఉండాలి. చిలికి చిలికి గాలివాన కాకుండా జాగ్రత్తపడాలి. కొందరు ‘మా దాంపత్య జీవితంలో గొడవలు లేవు’ అని గొప్పలు చెబుతూ ఉంటారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే భార్యాభర్తలన్నాక ఏదోక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అసలు కలహాలు లేని దాంపత్యం దాంపత్యమే కాదు. సంసారంలో అలకలు, బ్రతిమాడుకోవడాలు ఉంటేనే, దాంపత్యానికి నిండుదనం వస్తుంది. ఆలుమగల బంధం జీవితకాలం కొనసాగాల్సి ఉంటుంది కాబట్టి.. వారిమధ్య వచ్చే కలహాలు హుందాగా ఉండాలి. ఘర్షణను మాటలవరకే పరిమితం చేయాలి. అప్పుడే దాంపత్య జీవితంలో చక్కని ఫలితాలను పొందగలుగుతారు.

-కాయల నాగేంద్ర