Others

బామ్మగారు బంగారు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనలో చాలా మంది ముప్పై దాటగానే అంతా అయిపోయిందని అనుకుంటారు. ఫిట్‌నెస్ లేకుండా, అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అలాగని ఆ సమస్యలను అధిగమించేందుకు మాత్రం ప్రయత్నించరు. అటువంటి వారికి కనువిప్పు కలిగేలా 101 సంవత్సరాల ఈ బామ్మగారు ఇప్పటికీ పూర్తి ఫిట్‌నెస్‌తో అతి పెద్ద వయస్కురాలైన భారతీయ మహిళా అథ్లెట్‌గా రికార్డులకెక్కారు. పంజాబ్‌కు చెందిన మన్‌కౌర్ గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఇటీవల అక్లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్ గేమ్స్‌లో బెస్ట్ సీనియర్ అథ్లెట్‌గా బంగారు పతకం సాధించారు. న్యూజీలాండ్‌లోని అక్లాండ్‌లో జరిగిన 100 మీటర్ల స్ప్లింట్‌లో ఆమె ఈ ఘనతను సాధించారు. 74 సెకండ్లలో ఈ రికార్డును సొంతం చేసుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. దీని గురించి మన్‌కౌర్ 79 ఏళ్ల కుమారుడు గురుదేవ్ మాట్లాడుతూ తన తల్లి పట్టుదలతో దీనిని సాధించారని, ఈ వయసులో కూడా ఫిట్‌నెస్ కోసం పాటుపడుతూ, రోజువారీ సాధన చేస్తారని చెబుతున్నారు. ఆ పట్టుదల వల్లే ఆమె ఖాతాలో ఇప్పటి వరకు నాలుగు గోల్డ్‌మెడల్స్ వచ్చి చేరాయని అంటారు. అన్ని రకాలుగా ఫిట్‌నెస్‌తో ఉండే మన్‌కౌర్ కేవలం రన్నింగ్‌లోనే కాకుండా జావలిన్‌త్రో, వంద, రెండు వందల మీటర్ల షాట్‌పుట్‌లో కూడా దిట్టగా పేరుగాంచారు. ఫైనల్ పోటీల్లో ఈ వృద్ధురాలి విన్యాసం చూసేందుకు న్యూజీలాండ్‌లోని వెస్ట్ అక్లాండ్‌లో గల ట్రస్ట్స్ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా మన్‌కౌర్ ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించి సరికొత్త గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇలా రన్నింగ్, జావలిన్‌త్రో, షాట్‌పుట్‌లో రికార్డులు సొంతం చేసుకున్న మన్‌కౌర్ అంతటితో ఆగదలచుకోలేదు. అనితరసాధ్యమైన కృషితో స్కైవాక్‌లో కృషి చేసి 192 మీటర్లు స్కైవాక్ చేసి అబ్బురమనిపించారు. అక్లాండ్‌లోని సిటీ సెంటర్‌లో గల అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఈ ఫీట్ సాధించారు. నేరో ఎడ్జడ్ ప్లాట్‌ఫారంపై మన్‌కౌర్ సాధించిన ఈ ఫీట్ ప్రమాదకరమైనది. అయినా ఆమె ఒక్కింత కూడా వెరవలేదు. ఇలా విజేతగా ప్రపంచానికి పరిచయం అయిన ఈ శతాధిక వృద్ధురాలు మన్‌కౌర్ తన విజయం గురించి మాట్లాడుతూ తన ఫిట్‌నెస్‌కి కారణం తాను శాఖాహారిని కావడమే అంటారు. అలాగే కెఫిర్ అనే పాల పదార్థం, రొట్టెలు, గోధుమ ఆహారం అని కూడా చెబుతారు. మనం ఏదైనా సాధించాలని అనుకుంటే కృత నిశ్చయంతో కష్టపడాలని, అప్పుడే విజయం మన సొంతమవుతుందని అంటారు.

- దుర్గాప్రసాద్ సర్కార్