Others

చిన్నారులు బరువు తగ్గుతున్నారెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ఇటీవలి కాలంలో రెండేళ్ల లోపు చిన్నారుల్లో బరువుతక్కువగా ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో బరువు తక్కువగా ఉన్న పిల్లల సంఖ్య 1.4 శాతం మేరకు పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రెండేళ్ల లోపు చిన్నారుల్లో 33.1 శాతం మంది పిల్లలు ఉండవలసిన కనీస బరువుకన్నా తక్కువగా ఉన్నారు. 2015-16 నాటికి ఇలా ఉంటే 2012-14నాటికి వీరి సంఖ్య 31.7 శాతంగా ఉండేది. పట్టణాల్లో మాత్రం మెరుగైన పరిస్థితి నెలకొంది. 2015-16లో బరువు తక్కువగా ఉన్న రెండేళ్లలోపు చిన్నారుల సంఖ్య 22.22 శాతం ఉంటే అంతకు రెండేళ్ల ముందు ఇలా ఉన్న పిల్లల సంఖ్య 27.1 శాతం ఉంది. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనగాని మంజుల ఈ సర్వేను నిర్వహించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బరువు తక్కువగా ఉన్న చిన్నారుల పరిస్థితిపై ఆమె అధ్యయనం కొనసాగింది. తమ పిల్లలకు అవసరమైనంత వరకు చనుబాలు ఇస్తున్నవారికి ఈ సమస్య లేదు. అవసరానికి మించి ఎక్కువకాలం పాటు పిల్లలకు చనుబాలు ఇవ్వడం వల్ల వారు బరువు తక్కువతో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె అధ్యయనంలో తేలింది. చిన్నారులకు ఉన్న జీర్ణవ్యవస్థ ఆరో నెల నుంచి అభివృద్ది చెందుతుందని, అప్పటి నుంచి ప్రొటీన్లు, పౌష్టికాహారంతో, విటమిన్లతో కూడిన ప్రత్యామ్నాయ ఆహారాన్ని అందించాల్సి ఉంటుందని ఆమె సూచించారు. పట్టణాల్లో ఉన్న తల్లులకు ఈ విషయంపట్ల అవగాహన ఉండటం వల్ల అక్కడ పిల్లల పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారం వల్ల ప్రయోజనాలపై తల్లులకు సరైన అవగాహన, చైతన్యం లేకపోవడమే దీనికి కారణమని సీనియర్ న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ ఉషశ్రీ ఆలపాటి అన్నారు. పేదరికంవల్ల బలవర్ధక ఆహారం వారికి అందకపోవడం మరో సమస్య. ఈ విషయంలో ప్రభుత్వ చొరవ తీసుకుని విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది. గ్రామీణ ప్రాంతాలలోని తల్లులకు సరైన అవగాహన, పౌష్టికాహారం తీసుకుంటే కలిగే ప్రయోజనాలపై చైతన్యం కలిగించే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థలు పాలుపంచుకుంటే త్వరితగతిన ఫలితాలు అందుతాయి. ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పౌష్టికాహారం తల్లీబిడ్డలకు అందించాల్సి ఉంటుంది. పప్పుదినుసులు, తృణధాన్యాలు, కోడిగుడ్లు, కోడిమాంసంతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే బరువు పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. తెలంగాణలో అవిభాజ్య నిజామాబాద్ జిల్లా ఈ విషయంలో ఆందోళనకర స్థితిలో ఉంది. అంటే మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువమంది బరువు తక్కువ చిన్నారులు ఉన్నారన్నమాట. నిజామాబాద్ జిల్లాలో రెండేళ్లలోపు చిన్నారుల్లో 38.2 శాతం మంది పిల్లలు ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువుతో ఉంటే ఆదిలాబాద్ జిల్లా (రెండోస్థానం)లో 37.7 శాతం మంది, నల్గొండ జిల్లాలో 36.1, మెదక్ 35.9, మహబూబ్‌నగర్ 34.8, వరంగల్ 27.6, కరీంనగర్ 26, ఖమ్మం 23.1, రంగారెడ్డి 21.2, హైదరాబాద్ 16.8 శాతం చొప్పున ఉన్నారు. సోయాబీన్, వెన్న, చేపలు, కోడిమాంసం, పప్పులు, పన్నీర్, పాలు వంటి పదార్థాల్లో వంద గ్రాములకు వరుసగా 36 నుంచి 3.6 శాతం మేరకు పౌష్టికాహారం అందుతుంది. ఈ అధ్యయనం వివరాలను గమనించి ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

-కృష్ణతేజ