Others

చీకటి నవ్వు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వింతల్లో ఒకటైనా మోనాలిసా పెయింటింగ్‌లో ఆ మహిళ నవ్వు వెనుక దాగివున్న రహస్యాన్ని చేధించటానికి ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. లియోనార్డో డావిన్సీస్ వేసిన ఈ పెయింటింగ్‌లో మోనాలిసా చిరునవ్వు మర్మం ఆమె చీకటి జీవితం విషాదం దాగివుందని మార్టిన్ కెంప్ తాను రాసిన పుస్తకంలో వెల్లడించారు. క్రీస్తుపూర్వం 1479లో ఇటలీలో బానిస వ్యవస్థ ప్రబలంగా ఉండేది. ఫ్లోరెంటైన్ అనే వ్యాపారవేత్త బానిసలను విపరీతంగా కొనుగోలు చేసేవాడు. వారి చేత అడ్డమైన చాకిరీ చేయించుకునేవాడు. ఉత్తర అమెరికా నుంచి బానిసలను కొనుగోలు చేసి వారిని క్రిస్టియానిటిలోకి మార్చేసేవాడు. ఇలా ఆయన ఫ్లోరెన్సోలో జన్మించిన గెరర్డిని అనే 15 ఏళ్ల అమ్మాయిని బానిసగా తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి చీకటి జీవితం వెనుక దాగి ఉన్న నవ్వే మోనాలిసా పెయింటింగ్‌గా రూపుదిద్దుకున్నదనే ఈ రచయిత తన పుస్తకంలో పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్ పత్రిక పేర్కొంది. ఆ రోజుల్లో గియోండో ఇంట్లో అనేకమంది బానిసలు పనిచేసేవారు. ఆ బతుకులు చీకటిమయంగా ఉండేది. అవమానకరమైన ఆ జీవితం వెనుక దాగి ఉన్న నవ్వే మోనాలిసా నవ్వు అని నిర్ధారిస్తున్నాడు రచయిత. ఏదిఏమైనప్పటికీ ఈ ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఈ చిత్రం రహస్యాన్ని స్పష్టమైన ఆధారాలతో ఈనాటికీ వెల్లడించలేకపోతున్నారు.