Others

తాడాసనంతో ఉపశమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడ అంటే సంస్కృతంలో పర్వతమని అర్ధం. యోగ ప్రక్రియలో వేసే భంగిమనే సమస్థితి ఆసనమని కూడా అంటారు. సమ అంటే కదలని, సమతత్వం స్థితి అంటే నిలబడుట అని అర్ధం. కదలకుండా సమస్థితిలో నిలబడి చేసేదే సమస్థితి ఆసనం లేదా తాడాసనం అవుతుంది.
ఆసనం వేసే పద్ధతి
చదునైన నేలపై పాదాలలోని మడమలనుంచి బొటన వేలు దాకా ఒకదానికొకటి తాకిస్తూ నిలబడాలి. నిటారుగా ఉండాలి. అదే సమయంలో భుజాలను ముందుకు చాచాలి. అరచేతులు రెండు లోపలి వైపుకు అభిముఖంగా వుండేలా జాగ్రత్తపడాలి. మోకాళ్లు, తొడలు, పిరుదులు ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా వుండేలా చూసుకోవాలి.స్థిర విన్యాస స్థితిలో వుండాలి. ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. అలాగే భుజాలను పైకి లేపి చేతులను కలపాలి. అదే సమయంలో కలిపిన అరచేతులు ఆకాశాన్ని చూస్తూ వుండాలి.
ఈ విధంగా చేసే సమయంలో కాలివేళ్లపై నిలబడుతు పైకి లేవాలి. కొద్ది సమయం అలాగే వున్న తరువాత మెల్లగా గాలి వదులుతూ పూర్వ స్థితికి రావాలి. తరువాత కాళ్లను దూరం చేస్తూ విశ్రాంతి తీసుకోవాలి.
ఉపయోగాలు: ఈ ఆసనం వేయడంవలన దైనందిన చర్యల్లో భాగంగా మరిచిపోయిన సమస్యలను గుర్తించవచ్చు.