Others

నొప్పించని వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా? పెయిన్ కిల్లర్స్ మింగలేక నానా అగచాట్లు పడుతున్నారా? ఆపరేషన్ చేయించుకోవటమే శరణ్యం అని పరేషాన్ అవుతున్నారా?- ఇపుడు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికింది. అదే స్పోర్ట్స్ మెడిసిన్. ఆటలతో మీ నొప్పులన్నీ ఇక మటుమాయం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ మొవ్వ వెంకటేష్ ఈ వైద్యం చేయటంలో దిట్ట. అమెరికాలో 25 ఏళ్లుగా వైద్యుడిగా స్థిరపడిన వెంకటేష్ అక్కడ ఈ స్పోర్ట్స్ మెడిసిన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి నైపుణ్యం సాధించాడు. ఎందుకంటే వెంకటేష్‌కు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, మెడిసిన్ అంటే ప్రాణం. ఈ రెండింటిని మేళవించి రూపొందించిన ఈ స్పోర్ట్స్ మెడిసిన్ మనదేశంలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో అమెరికా స్టయిల్‌కు చెందిన ఫుట్‌బాల్ లీగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆయన గోల్ హైదరాబాద్‌లో కూడా ఈ క్రీడావైద్యాన్ని అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే స్థానిక యువకుల్లో క్రీడానైపుణ్యం దాగి ఉంది. చాలామంది ప్రొఫెషనల్ అథ్లెట్స్ ఉన్నారు. వీరి సేవలను వినియోగించుకోవటానికి డాక్టర్ వెంకటేష్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఎలైట్ ఫుట్‌బాల్ లీగ్‌ను ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాలలో ప్రవేశపెడితే ఇక ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని అంటారు డాక్టర్ వెంకటేష్. కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి ఈ క్రీడల వైద్య విదానాన్ని అభ్యసించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడిగా తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. మనదేశంలో మోకాలి నొప్పుతో బాధపడేవారు ఆ బాధ భరించలేక కీళ్ల మార్పిడికి సైతం సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ రేజెనెక్స్ వైద్య విదానం వల్ల పాడైన కీళ్లను పునరుత్పాదక చికిత్స ద్వారా మళ్లీ మామూలు స్థితికి తీసుకురావచ్చు. ‘‘రీజెనరేటివ్’ స్టెమ్ సెల్ టెక్నాలజీ ఉపయోగించి మోకాళ్ల నొప్పులను మటుమాయం చేసుకోవచ్చు. ఈ వైద్య విధానం భారతీయులు ఆదరిస్తారనే నమ్మకం ఉందంటారు డాక్టర్ వెంకటేష్. అత్యధిక నాణ్యతా ప్రమాణాలతో ప్రామాణికమైన వైద్య సేవలు అందించటానికి ఈ యువ వైద్యుడి ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆశిద్దాం.