Others

కృష్ణమాయలో గోకులం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభావతి చేతికి కృష్ణయ్యనే దొరికాడు. అతడిని పట్టుకుని కోపంతో కనులెర్ర చేసి ఇంకోసారి మా ఇంటి పాలుపెరుగు మననివ్వకపోతే మీ అమ్మతో చెప్పి దండిస్తానని బెదరించింది. మాయా మానుష వేషధారి కృష్ణయ్య ఆమెకు భయపడుతూ ‘ఇంకోసారి మీ ఇంట రానులే.. ’ అంటూ ఆమె నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు.
గోకులమంతా తిరుగుతూ అందరి ఇండ్లల్లోని పాలు పెరుగులను వెన్నమీగడలను యథేచ్ఛగా తినడం, పెరుగుకుండలను చిందర వందర చేసేసి వెళ్లడం కృష్ణబృందం చేస్తున్నారు. ఆరంభంలో చిన్నవాడు లే లేక లేక నందుని ఇంట మెరిసిన వజ్రమని అందరూ ఊరుకొన్నారు. కాని చిన్న వాడు చిన్మయుడు కనుక అతని చేష్టలు రానురాను శృతి మించసాగాయి. అంతే అందరూ కృష్ణుని మీద అలకలు పోయేవారు. ఇంకా కోపం తీరని వారు వారి అక్కసును ఇతరులతో చెప్పుకునేవారు. ఈసారి ఎట్లాగైనా కృష్ణుడిని పట్టుకుని వారి అమ్మకు చూపాలనుకొన్నారు. ఎందుకంటే కొందరు గోపికలు కలసి యశోదమ్మ దగ్గరకు వెళ్లారు. అందులో ఓ గోపిక వెళ్లి .. ‘‘అమ్మా! యశోదమ్మా! మీకుమారుడు మా ఇండ్ల పాలు పెరుగు మననీయడమ్మా!’ అని చెప్పింది. ఆ గోపిక చెప్పింది విన్న యశోద పగలబడి నవ్వింది. పైగా ‘‘మీరు చెప్పేది చోద్యంగా ఉంది. మా ఇంట్లో లక్షలకొద్దీ గోసంపద ఉంది. పైగా మా ఇల్లంతా వెన్నమీగడలతో ఎల్లవేళలా నిండి ఉంది. వెన్న కోసమో, పెరుగుకోసమో మీ ఇంటికి మా చిన్నవాడు రానవసరమే లేదు. పైగా నేను ఎంతో బతిమాలి బామాలి పెట్టినా తినని వాడు మీ ఇంట తింటున్నాడు అంటే నేనేలా నమ్మేది. పోయిరావమ్మ... ’’ అంటూ యశోద ఎక్కసెక్కాలాడింది. దాంతో మరింత బాధకు లోనైన గోపకాంతలందరూ ఎప్పుడెప్పుడా ఈ యశోదానందుణ్ణి పట్టుకోవడం అని చూస్తున్నారు. ఇలా పట్టుకుని తామే చెవిని నలుపుతూ యశోద దగ్గరకు తీసుకొని వెళ్లాలని అనుకొన్నారు. అందరూ కాచుకుని కూర్చున్నారు. దొరికించుకోవాలనుకొంటే దొరికేవాడు పరమాత్ముడు కాదుకదా. ఆయన ఎవరికి దొరకాలనుకొంటాడో వారికే దొరుకుసౌభాగ్యం కదా.
ఈ సారి వేదవతి చేతికి కృష్ణయ్య దొరికాడు. ఆమె ఎంతో మురిసి పోయింది. ‘ఇక నీ ఆటకట్టు’ చూడు నీ సంగతి అంటూ యశోద దగ్గరకు వడివడిగా అంగలు వేసుకుంటూ అంగన బయలుదేరింది. వాకిట కూర్చున్న నందుడిని చూచి చిరునవ్వు నవ్వి గబగబా ‘‘యశోదా! ఓయశోదమ్మా! ఒక్కసారి బయటకు రావమ్మా! ’ అంటూ కేకలు పెట్టింది. లోపల పెరుగు చిలుకుతున్న యశోద పరుగెత్తుకు వచ్చింది.ఆమె కొంగు పట్టుకొని వెన్న తిననని మారాం చేస్తున్న కృష్ణుడు కూడా వచ్చాడు.

చరణ శ్రీ