Others

ఆసక్తి కలిగించే ఇంద్రాణి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏది ఏమైనా ఎవరి ధీశక్తి వారిదే అనుకోండి. కాని ఈ దమయంతి ఇలా ఉండడానికి పూర్వజన్మ గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. అది సరే. ఇప్పటిమాట - ద్రౌపది పంచభర్తృక అని కర్ణుని లాంటి వాళ్ల చేత పరిహసించబడింది. ఈ స్థితికి కారణం మాత్రం ఆమె పూర్వజన్మనే. ఎందుకంటే అసలు స్వయంవరంలో అర్జునుడు గెలుచుకున్న ద్రౌపదిని కుంతిదేవి ఆజ్ఞ వల్ల ఐదుగురు భర్తలు కావడమెలా అనుకొన్న తరుణంలో వ్యాసుల వారే ఈమెను మీరు ఏమీ సంశయించకుండా వివాహం చేసుకోవచ్చునని చెబుతూ ఆమె పూర్వజన్మ గురించి చెప్పినట్లు మహాభారతం చెబుతుంది.
ద్రౌపది అయోనిజ. ఆమె యజ్ఞకుండం నుంచి ఉద్భవించింది. ద్రుపద మహారాజు సంతతి కోసం యాగం చేయగా లభించిన వరం ద్రౌపది. అటువంటి ద్రౌపది పూర్వజనంలో ఇంద్రాణి. అమరావతిలోని ఇంద్రుని ఇల్లాలు ఇంద్రాణి. ఇంద్రాణి ద్రౌపదిగా జన్మనెత్తడానికి ఆసక్తికరమైన కథ మార్కండేయ పురాణం మనకు చెబుతోంది.
పూర్వం త్రిశిరుడు అను రాక్షసుడు ఉండేవాడు. కాలవశంలో ఇంద్రుడు ఆ త్రిశిరుడిని వధించాడు. అపుడు ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. దాని వల్ల అమరావతిని వదిలి హిమగిరిలోని మానస సరోవరంలోని తామర తూడులో సూక్ష్మరూపంలో దాక్కొన్నాడు. అపుడు అమరావతి రాజు లేనిది అయింది. రాజు లేకుంటే అరిష్టాలు కలుగుతాయని మనుష్యలోకంలో నూరవ క్రతువు చేయడం కోసం ఎదురుచూస్తున్న నహుషడనే రాజును ఇంద్రునిగా చేయమని దేవతలకు బృహస్పతి సలహా ఇచ్చాడు.

- రాయసం లక్ష్మి