Others

సరస్వతీ నమస్త్భ్యుం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితంలో ముఖ్యమైనది- వాక్కు, మాట. వాక్కు అంటే శబ్ద ‘శక్తి’. మాట తీరు మనస్సుకు అద్దం పడుతుంది. మనిషి సంస్కారాన్ని తెలియజేస్తుంది. బ్రహ్మాస్త్రాన్నైనా వెనక్కు తీసికోవచ్చునేమోగాని, పెదవి దాటిన మాటను వెనక్కు మళ్లించటం బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు. మాట తీరును మధురతరం చేసి జీవన సరళిని ఆనందమయం చేసి, మనశ్శాంతినిచ్చే మహాశక్తి, వాగ్దేవి, చదువులతల్లి- సరస్వతీదేవి. ‘‘ప్రణోదేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామ విత్త్యవతు’’ అన్నది వేదం. సుఖ దుఃఖ రూపమైన లౌకిక స్థాయి, ఆనంద పర్యవసాయులైన అలౌకిక స్థాయి, ఆత్మానంద రూపమైన ఆధ్యాత్మిక స్థాయి- ఈ త్రిస్థాయిలలో పొందే చిత్తవృత్తి- ఒక సరస్సు. ఆ సరస్సే అనుభవజ్ఞానాశక్తి స్వరూపమైన సరస్వతీమాతకు నిలయం. కనుక సరస్వతీ అంటే విద్య అనుభవరూపం, అని సరస్వతి నదీ రూపంలో పేర్కొనబడింది. ‘‘సరాంసి జలాని సంతి అస్యాః ఇతి సరస్వతి’’ అన్నది మేదినీకోశం. మూలా నక్షత్రం ఉన్నరోజున సప్తమి తిథి రోజున సరస్వతీ పూజ చేస్తారు. మూలానక్షత్రం ధనూరాశిలో ఉంటుంది, అధిపతి గురుడు- ధన, విద్యా, కుటుంబ, గృహ, వాహన, వాక్కులనిచ్చేవాడు. మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవిని పూజిస్తే సత్వగుణం అనుగ్రహించి, చదువులలో మర్మమెల్ల తెలిపే చదువును ప్రసాదిస్తుంది. దీనితో అన్ని భాగ్యాలు అనుభవంలోకి వస్తాయి.
శుంభుడు రాజుగా, నిశుంభుడు మంత్రిగా, చండముండ రక్తబీజ ధూమ్రలోచనులు సేనాపతులుగా, ప్రజాపీడనంగా రాజ్యపాలన జరుగుతోంది. ఇంద్రాది దేవతలకు అభయమిచ్చి, వాగ్దేవి తన శరీరము నుండి ‘కౌశికి’ అనే శక్తిని సృజించింది. ఆ కౌశికియే - కాళీమాత. రాక్షస సంహారం ‘కాళీ’ శక్తితో గావించింది వాగ్దేవి. కాలతత్త్వానికి సూచన కాళీమాత. కాలగర్భంలో సర్వమూ ఉదయిస్తాయి, సర్వమూ లయమవుతాయి. సర్వవిద్యాధిష్ఠాత్రి- కాళీమాత. అందుకే కాళీ శక్తిని, బాలబీజ మంత్రంతో అనుష్ఠించి, ఉపాసించి మహాకవియై సాహిత్య వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతూ, చిరస్థాయిగా నిలిచినవాడు- కాళిదాసు. లోచనములకు గోచరముగాని జ్ఞానజ్యోతి మహాసరస్వతి.
వ్యాస మహాముని గావించిన స్తోత్రములకు సంతుష్టురాలైంది సరస్వతీమాత. ‘వాసరా’ నగరంలో సుమనోహరమగు గోదావరీ నదీ తీరాన నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజింపమని అనుగ్రహించింది జగన్మాత. శబ్ద బ్రహ్మ స్వరూపిణి అయిన జ్ఞాన సరస్వతీదేవిని ప్రతిష్ఠించారు వ్యాసభగవానులు.
తల్లిని కొలిచి ఆమె అనుగ్రహమును పొందినవారి పేరుమీదుగా- వాల్మీకి తీర్థము, విష్ణుతీర్థము, శ్రీగణేశతీర్థము, పుత్రతీర్థము, శంకర తీర్థము వెలిసినాయి. ఆ మహాక్షేత్రమే నేటి ‘బాసర’. ‘‘సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి జగతా మాది భూతాత్వం జగత్త్వం జగదాకృతిః’’ అని దేవిని స్తోత్రించాడు వ్యాసుడు (బ్రహ్మాండ పురాణాంతర్గతము). దేవమనోహరి, తోయ వేగవాహిని, ఛాయాగౌళ, ఛాయాతరంగిణి, ఆరభి, గీర్వాణి, హిందోళ, శరావతి రాగములలో ముత్తుస్వామి దీక్షితులు కీర్తించిన సరస్వతీకృతులు, శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములలో, మూలా నక్షత్రం సరస్వతీ పూజకు పూర్తి స్ఫూర్తినిస్తాయి.
జీవిత లక్ష్యాన్ని పొందే మంచి మార్గాన్ని తెలిసికొని, విజ్ఞానవంతులై, జ్ఞానవంతులై సర్వ మానవాళి సేవలో జగన్మాతను దర్శించటమే ప్రహ్లాదుడు చెప్పిన ‘‘చదులలో మర్మమెల్ల చదవడం’’ అని చెప్తోంది చదువుల తల్లి మహా సరస్వతి.

-పసుమర్తి కామేశ్వర శర్మ 9440737464