Others

రకుల్..రకుల్...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ఎవ్వరి నోట విన్నా ఇదే పేరు. వెండితెరపై అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో ఎంతో క్రేజ్‌ని సంపాదించుకుంది. అలా వచ్చిన క్రేజ్ ఆమెకు స్టార్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న కథానాయికల్లో రకుల్ ప్రీత్‌సింగ్ పేరు కూడా వుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ సక్సెస్ బాటలో పరుగులు తీస్తోంది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో డైరీ ఖాళీ లేకుండా వరుస చిత్రాలతో రివ్వున అగ్రపథంలో దూసుకెళుతూ యమజోరు మీదుంది. క్రేజీ హీరోలతో జోడీ కట్టడమేగాక, అగ్ర హీరోలందరి సరసన మెరిసిపోతోంది. ఇంతగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు త్వరలోనే నీరజ్‌పాండే దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతోంది. కెరీర్‌ని ఎలా ఆస్వాదిస్తున్నారు అని రకుల్‌ని కదిలిస్తే- ‘‘వాహ్.. చాలా హ్యాపీగా వుంది. నాకు ఇంతటి క్రేజ్‌ని తెచ్చిపెట్టిన టాలీవుడ్‌ని నేను ఎన్నటికీ మరచిపోను. నటిగా ఈ స్ధాయికి చేరుకునేందుకు ఎదుర్కొన్న కష్టాలను ఆనందంతో మరచిపోయాను. నటిగా మంచి పేరును తెచ్చిపెట్టే పాత్రల్లోనే కనిపించాలని పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అనుకున్నా. బాగా డబ్బులు సంపాదించేయాలన్న అత్యాశతో నేను పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లకి ఇక్కడ అవకాశాలు అంత సులువుగా రావు అన్నది నాకు బాగా తెలుసు. అందుకే అదృష్టం తలుపుతట్టి వచ్చిన అవకాశాలను ఏ మాత్రం జారవిడుచుకోకుండా కెరీర్‌లో దూసుకెళ్లే ప్రయత్నం చేశాను. నా దారిలోనే పయనిస్తూ ఒక్కోమెట్టు ఎక్కుతూ వచ్చా. అందుకే గత కొనే్నళ్లుగా టాలీవుడ్‌లో నటిగా కొనసాగుతున్నా. తెలుగు చిత్రసీమలో స్టార్ నటులు.. కొత్త నటులు అంటూ ప్రత్యేకంగా విడదీసి చూడరు. అందర్నీ ఒకేలా చూస్తారు. అదే టాలీవుడ్ ప్రత్యేకత. ప్రతిభ వుంటే చాలు టాలీవుడ్ అక్కున చేర్చుకొని ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తుంది’’ అని రకుల్ సంతోషాన్ని పంచుకుంది. దటీజ్..రకుల్!