Others

హత్యాకాండ ఆగితేనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల 9వ తేదీ మంగళవారం రాత్రి ‘గౌరీ లంకేష్ పత్రికే’ అన్న పత్రికను నడుపుతున్న గౌరీ లంకేష్ అన్న 55 ఏళ్ళ జర్నలిస్టు- ఉద్యమకారిణి అయిన మహిళ- బెంగుళూరులోని ఆర్‌ఆర్ నగర్‌లో ఆవిడ ఇంటిముందు పిస్తోళ్ళతో ఏడుసార్లు కాల్చబడి చంపబడింది. బైక్‌మీద వచ్చిన ముగ్గురు ఆమెను కాల్చిపోయారు. వాళ్లు ఇంతవరకూ దొరకలేదు.. కారణాలు తెలియరావటంలేదు, కానీ కొన్ని అనుమానాలున్నాయి.
1) నక్సలైట్లను పౌరులుగా మార్చి జనజీవనంలో భాగం చెయ్యాలి అనీ, 2) ‘మడే మడే స్నాన’ అన్న పేరుగల కర్నాటక దేవాలయాల్లో ఉచిత భోజనాలు అయ్యాక పుణ్యం కోసం ఆ విస్తరాకుల్లో కొంతమంది భక్తులు పడుకొని దొర్లటం తప్పనీ, 3) దుంఢి అనే హిందూ వ్యతిరేక నవల రాసిన యోగేష్ మాస్టర్ అన్న ఉద్యమకారుని మొహాన్ని కొంతమంది మొన్న 2017 మార్చిలో నల్లరంగుతో పులమటం ఘోరమనీ, 4)2015లో ధార్వాడ్‌లో ఎమ్.ఎమ్.కల్‌బూర్గి అనే కమ్యూనిస్టు రచయితనూ, కొల్హాపూర్ గోవింద్ పల్హారే అన్న నాయకుణ్ణీ, పూనాలో 2013లో నరేంద్ర దభోల్కర్ అన్న నాయకుణ్ణీ చంపటాలు చాలా పాశవిక చర్యలనీ అంటూ ఆవిడ తన పత్రికలో ప్రచారం చేసింది. ఇప్పుడు కొత్తగా, లింగాయతులు హిందువులు కారు కనుక వారిని మైనారిటీ మతంగా గుర్తించాలనీ, మాయన్మార్‌నించి వచ్చి స్థిరపడి అల్లర్లు చేస్తూన్న రోహింగ్యా ముస్లిములను తిరిగి వెనక్కి పంపటం మోడీ చేస్తున్న పెద్ద నేరమనీ, అసలు మోడీ భక్తులు, హిందూత్వ శక్తులు తనని జైలుకు పంపటానికి నిర్విరామంగా కృషి చేస్తున్నాయనీ- అని కూడా ఆమె తన పత్రికలో ప్రచారం మొదలుపెట్టింది.
అది తప్పే..కానీ..
హత్య తప్పే. పెద్ద నేరమే. దాన్ని పౌర సమాజంలో ఎవ్వరూ ఒప్పుకోరు. కోర్టులు నేరస్థులకు శిక్షలు వెయ్యాల్సిందే. కానీ ఈ హత్యకన్నా ఘోరంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. హత్యోదంతాలు ఎన్నో ఉన్నాయి. గత 2015లో బెంగుళూరుకు సుమారు 100 కి.మీల దూరంలో వున్న మూడాచిద్రి (జైన దేవాలయం) ఉన్న గ్రామంలో పూలు అమ్ముకునే ఒక బజరంగ్‌దళ్ వర్తకుడిని బైక్‌మీద ఎవరో ముగ్గురొచ్చి కాల్చి చంపేసి పారిపోయారు. మెడికెరి (మెర్కారా)ల టిప్పు సుల్తాన్ ఉత్సవానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూన్న వాళ్లలో ఒక వృద్ధుడు గోడదూకి పారిపోబోతే అతడిని పోలీసులు కాల్చి చంపేశారు. ఈ నెల 4న హైదరాబాద్ నించి వెళ్లిన కేశవ రెడ్డి తన స్నేహితుడితో కలిసి బెంగుళూరులో టాక్సీలో ఫారెస్టు డిపార్టుమెంటుకు పొద్దునే్న వెడుతూ ‘ఏసి ఆపేస్తున్నా’ అని డ్రైవర్‌తో అనగానే ‘నా ఏసీ ఆపటానికి నువ్వెడవు?’ అని అంటూ ఆ డ్రైవర్, ఆరిఫ్ ఇనపరాడ్‌తో ఆ రెడ్డి తలపగలగొట్టాడు. ఎక్కడో ఆవును కోసినందుకు ఎవరో ముస్లిం యువకుడిని చంపారని ఆ చుట్టుప్రక్కలున్న హిందువులకు వ్యతిరేకంగా దేశంలోని విప్లవకారులందరూ ఉద్యమాలు చేసారే (షబ్నా ఆజ్మీ ముఠా), వీటికి చెయ్యక్కర్లేదా?
కేరళలో ఏం జరుగుతోంది..
అన్నింటికన్నా భయంకరమైనది- కేరళలోని పినరాయ్ ప్రభుత్వంలోనూ, బయటి సంస్థల్లోనూ అందరూ మార్క్సిస్టులే. కనుక దేశభక్తులైన హిందూ యువకుల్ని నెలకొకణ్ణి చొప్పున చంపుకుంటూ పోవచ్చా? అక్కడ జరుగుతున్నదే అది. బజరంగ్‌దళ్ వాడు కనిపిస్తే చంపెయ్యటమే పని. ఇప్పటికి ఎన్ని వందలమంది కేరళలో మార్క్సిస్టుల చేతిలో ఆహుతి అయ్యారో! వీళ్ళెవ్వరూ మనుష్యులు కారా? వీళ్లెవరూ ‘మేధావి చరిత్రకారుడు’గా పల్లకీలో మోయబడుతున్న రామచంద్ర గుహకు మానవులుగా కనిపించరా? బెంగుళూరు, ధార్వాడ్, గదగ్‌లలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టులకు ఈ విధంగా చంపబడుతూన్న హిందువుల ప్రాణాలుగా కనిపించవా?.. ఈ నిరసనలు ఇంకా పెరగొచ్చు. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య అండదండలతో అవి ఎంత ఎత్తుకైనా ఎగరొచ్చు. వీటి లక్ష్యమల్లా మోడీని జెండా కొమ్ముకు కట్టి అల్లరిపాలు చెయ్యటం. అంతేకాని ఈ ప్రజల సంక్షేమం కాదు, ఈ దేశ ప్రతిష్ఠ కాదు! కన్నడ, కేరళ, కొండొకచో తమిళనాడులలో హిందువులమీద దాడులు హత్యలు ఆగితేనే అన్ని రకాల హత్యలు ఆగుతాయి. అప్పుడే దక్షిణాదిన అభివృద్ధి. లేకపోతే ఇంతే సంగతులు!

-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు