Others

ఆవు పాలతో అలర్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో 3 శాతం మంది చిన్నారులు ఆవుపాలు తాగితే అలర్జీకి గురవుతున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. సాధారణ వైద్యులు, గైనకాలజిస్టులు, న్యూట్రిషనిస్టులు ఇటీవలి కాలంలో వచ్చిన పలు అధ్యయనాలను విశే్లషించి ఈ విషయాన్ని రూఢీ చేశారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడేళ్లలోపు వరకు ఆవుపాలను తాగితే వాంతులు, విరేచనాలు, రక్త విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, కోరింత దగ్గు, జలుబు, ఎక్కువ సేపు ఏడుస్తూండటం వంటి సమస్యలు ఎదొర్కుంటున్నారని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా మన దేశంలో ప్రతి వందమందిలో ముగ్గురు ఈ లక్షణాలతో కనిపించారని వారు తేల్చారు. ఆవుపాలలో 23 రకాల మాంసకృత్తులు ఉంటాయని, వాటిలో నాలుగు రకాల ప్రొటీన్లు చిన్నారుల్లో ఈ అలర్జీకి కారణమని వారు తేల్చారు. పిల్లలు ఎందుకు అస్వస్థతకు గురవుతున్నారో తల్లులు గుర్తించలేరని, నిజానికి వైద్యులు కూడా వారి సమస్యను సరిగా డయాగ్నైజ్ చేయలేకపోతుంటారని డాక్టర్ ప్రశాంత్ బాచిన అంటున్నారు. పిల్లలకు అందిస్తున్న ఆహారం, ఎంత పరిమాణం, ఎలా ఇస్తున్నారన్న విషయంలో పూర్తి అవగాహన ఉంటే తప్ప రోగ నిర్ధారణ సాధ్యం కాదని ఆయన అంటున్నారు. ఆవుపాలలోని కొన్ని ప్రొటీన్లను పిల్లలు జీర్ణం చేసుకోలేరని, వాటివల్ల పేగులు, జీర్ణవ్యవస్థలోని పైపొరలు దెబ్బతిని వారు వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలవుతారని తేల్చారు. నిజానికి ఇంత చిన్నవయసులో పిల్లలు అనారోగ్యం పాలైతే అది వారి ఎదుగుదలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఆవుపాలకు బదులు సోయాపాలు, మరికొన్ని ప్రత్యామ్నాయ ఆహారం అందిస్తే వారికి ఉపశమనంతోపాటు చక్కటి ఆరోగ్యం చేకూరుతుందని వారు చెబుతున్నారు.

-తేజ