Others

అన్నపూర్ణే సదాపూర్ణే ....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘త స్మద్వాఏతస్మాదాత్మనః ఆకాశస్సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభోన్నం అన్నాత్పురుషః సవా ఏష పురుషోన్నరసమయః’’ పరబ్రహ్మతత్త్వం నుండి ఆకాశము ఉద్భవించింది. ఆకాశము నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము (ఆహారము), అన్నము నుండి ప్రాణి పుడుతున్నాయి. పురుషాది ప్రాణికోటి అంతా అన్నరసమయము. అన్నరసముతో నిండియున్నది అన్నపూర్ణ.
కనుక, సకల ప్రాణుల స్వరూపం అన్నపూర్ణాదేవి.స్థూలంగా సేవిస్తే సాకారంలో, సూక్ష్మంగా భావించి ధ్యానించి ఆరాధిస్తే నిరాకారంగా సాక్షాత్కరిస్తుంది- అన్నపూర్ణాదేవి. ధ్యాన ఆవాహన అర్ఘ్యపాద్య ధూప దీప నైవేద్యాది షోడసోపచారములకూ ఆనందపడుతుంది. దహరాకాశంలో రసస్వరూపిణిగా ధ్యానం చేసే మానసిక పూజకు దరహాసం చిందిస్తుంది. ఎవరు ఎలా చింతించి స్మరిస్తే వారికి ఆవిధంగా సాక్షాత్కరిస్తుంది- అన్నపూర్ణాదేవి.
చంద్రకళ ఆభరణముగాగల అర్థరూపుడైన దేవుని అర్థాంగి, సర్వలోకాత్ముడైన శంభుమూర్తి వక్షస్థలమే అనగా అంతర్గత సూర్యమండలమే నిత్య నివాసముగా స్ఫురించు తేజోరూపిణి, దారిద్య్రమును దానివలన కలుగు దుఃఖమును, దానికి ముందు వెనుక కన్పట్టు భయమును పాఱద్రోలు అమృతవర్షిణి ‘అన్నపూర్ణాదేవి’ అని స్తుతించారు, ఆదిశంకరాచార్యులు.
‘‘అహమన్న మహమన్న మహమన్నమ్ అహమన్నాదోహ మన్నా దోహమన్నాదః ఆదిత్యాజ్ఞాయతే వృష్టిః వృష్టేరన్నం తతః ప్రజాః’’ అని, స్మృతులు సూర్యుని వలన మంచి వర్షములు, వర్షమువలన మంచి అన్నము, అన్నము నుండి ప్రజలు పుడుతున్నారని, అన్నమును ముందు సూర్యునికి నివేదించి తర్వాత ఆరగించాలని బోధిస్తున్నాయి. సూర్యునిలోని శక్తియే- అన్నపూర్ణాదేవి.అన్నరూపంగా జీవులలో ప్రవేశించి, స్ర్తి పురుషులలో, శుక్ల శోణితములుగా మారి, జీవోత్పత్తి జరుగుతుంది. కనుక ‘అన్నం’ నుండే రేతస్సు కలుగుతుంది. దాని నుండి రుూ ప్రాణిజాలమంతా జన్మ ఎత్తుతుంది. కనుక, జీవుల జీవాల్ని నియమం చేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి. తైత్తిరీయ ఆరణ్యకం, ప్రశ్నోపనిషత్, బృహదారణ్యకోపనిషత్ భగవద్గీత మనకు రుూ విషయాల్ని అందజేసినాయి.
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అన్న శ్లోకాన్నిప్రతిరోజు ఎవరు పఠిస్తారో వారంతా దుఃఖానికిదూరులవుతారు. అంతే కాదు వారింట అన్నం సమృద్ధిగా ఉంటుంది. ఈ అన్నపూర్ణాదేవి కేవలం క్షుద్బాధనే కాదు తీర్చేది జ్ఞానాన్ని కలుగచేసి జ్ఞాన దాహాన్నికూడా తీరుస్తుంది. ఆ జ్ఞానం చేత శివశక్తులసాయుజ్యాన్ని పొందవచ్చు. ఈ తల్లిని ఆరాధించినవారందరూ ఇతరులకు తనకున్నదాంట్లో కొంత అన్నదానం చేస్తారు. దానివల్ల వారి పాపాలన్నీ దగ్ధమైపోతాయి. వారి యింట్లో సుఖశాంతులు వెలసి గృహం- నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఆరోగ్యంగా భాసిల్లుతుంది.అన్నార్తులకు అన్నాన్ని దాహార్తులకు దాహాన్ని దానం చేయడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభ్యమవుతుంది.

- రాం ప్రసాద్