Others

స్వర్గారోహణ చేసినా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవతలంతా కలసి నహుషుడిని ఇంద్రుడుగా చేసారు. నహుషుడు కూడా ఎంతో ఆనందంతో ఇంద్ర పదవిని తీసుకొన్నాడు. కాని కొన్నాళ్లల్లోనే నహుషుడికి అహంకారం పెరిగింది. ఇపుడు నేను ఇంద్రుణ్ణి కనుక ఇంద్రుని భార్య ఇంద్రాణి కూడా నాకే చెందాలని ఆమెకు కబురు పెట్టాడు. దీనికి ఇంద్రాణి కలత చెందింది. ఆమె ఇంద్రుని తప్ప మరొకరిని చూడనని ఈ నహుషుడి బారినుంచి తప్పించమని బృహస్పతిని వేడుకుంది.
బృహస్పతి ఇచ్చిన సలహాతో నహుషుడిని పల్లకి ఎక్కి రమ్మంది. ఆ పల్లకినీ సప్తఋషులచేత మోయించుకుని మరీ రమ్మని చెప్పింది. మతిచాంచల్యం పొందిన నహుషుడు పల్లకిని అధిరోహించాడు. ఆ పల్లకిని అగస్త్యాది ఋషులను మోయమని చెప్పాడు. దాంతో మునులంతా బోయిలుగా మారి నహుషుడిని మోస్తూ ఇంద్రాణి దగ్గరకు తీసుకొని వస్తున్నారు. మార్గమధ్యంలో దారిలో ఉన్న ఎత్తుపల్లాల వల్ల నహుషునకు మార్గాయాసం దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఏర్పడ్డాయి. దీనికి కారణం ఈ సప్తఋషులని వారిని గట్టిగా మందలించి నాకు దెబ్బతగలకుండా తీసుకెళ్లమని చెప్పాడు.
అపుడు ఆ మాటలకు అగస్త్యుడు నొచ్చుకున్నాడు. వెంటనే ‘‘ఓరుూ నీవు మమ్మే అదిలిస్తావా? మహాసర్పమై పడి ఉందువుగాక! ’’అని ఆయన శపించాడు. అంతే నహుషుడు సర్పమై పోయాడు. ఆ సమయానికి ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం వదిలే సమయం ఆసన్నమైంది. ఇంద్రుడు బృహస్పతి సలహాతో మళ్లీ ఇంద్రపదవి అలంకరించాడు. కాని బ్రహ్మహత్యాపాతకం వచ్చి మాకు తగిన స్థానాన్ని ఇవ్వుమని అడిగింది. అపుడు బ్రహ్మ హత్యాపాతకాన్ని నాలుగు విభాలుగా చేసి వివిధ ప్రదేశాల్లో పెట్టారు. దీనికన్నా ముందు ఇంద్రుడు తనకు చుట్టుకొనిన బ్రహ్మహత్యాపాతకాన్ని యమునకు, వాయువునకు, అశ్వినీ దేవతలకు ఆ హత్యాపాతకాన్ని ఇంద్రుడు పంచాడు. అపుడే ఇంద్ర తేజంతో ధర్మరాజు, భీముడు, అర్జునుడు నకులుడు, సహదేవుడు పుట్టారు.
ఈ సంగతి అంతా ఇంద్రాణికి తెలిసింది.
ఇంద్రుని రూపే ఐదురూపాలతో భువిపై ఉందని తెలుసుకొని ఆమె అంటే ఇంద్రాణి ద్రౌపదిగా ద్రుపద మహారాజు అగ్నికుండం నుంచి ఆవిర్భవించింది. ఇంద్రాణినే ద్రౌపదిగా ద్రుపదుని ఇంట పెరిగింది. ఆమె అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టగా స్వయంవరంలో పాండవులకు దక్కింది. కుంతీదేవి ఆజ్ఞతో పాండవుల ఐదుగురికీ (ఒక్క ఇంద్రుని అంశనే) భార్యగా వచ్చింది.
ఇంతేకాదు ద్రౌపది మరో జన్మలో వౌద్గల్యమహర్షి భార్యగా ఉండేది. ఆమె పరమ పతివ్రత. భర్తసేవ తోడిదే జీవితం అనుకొనేది. వౌద్గల్య మహర్షి భార్య ఇంద్రసేన. ఈమె నాలాయనుడు అను ఋషివరుని కుమార్తె. చిన్నప్పటి నుంచి మంచి దైవభక్తి కలదిగా నడుచుకునేది. వౌద్గల్యమహర్షికి ఒకసారి కుష్టురోగం వచ్చింది. ఆ రోగం వల్ల మహర్షి శరీరమంతా శిథిలమవుతూ ఉండేది. ఒళ్లంతా పుండ్లతో ఉండేది. కాని ఆయన భార్య యైన ఇంద్రసేన కాస్తకూడా విసుగు విరామం లేకుండా సేవ చేస్తుండేది. ఈమె సేవలకు వౌద్గల్యుడు తృప్తి చెందాడు. ఇంద్రసేనను ఏదైనా వరం కావాలో కోరుకోమంటే వౌద్గల్యమహర్షిని ఈ కుష్ఠురోగం పోయి మంచి నవయవ్వనంతో ఉండేలాగు మీరు మారి నాతో జీవించండి అని కోరుకుంది. ఆమె కోరిక ప్రకారం తన తపశ్శక్తితో కుష్ఠురోగాన్ని వౌద్గల్యుడు దూరం చేసుకొని ఇంద్రసేన తో సంసారం చేసాడు. ఆ తరువాత ఇంద్రసేన తపస్సు చేసుకుంటూనే శరీరం చాలించింది. మరుజన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించింది. అపుడు తనకు మంచి భర్త కావాలని పరమశివుని కోరి దీర్ఘ తపస్సు చేసింది.

- రాయసం లక్ష్మి 9703344804