Others

చిన్మయుని చిలిపిచేష్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ చ్చింది ఎవరో కూడా చూడకుండానే యశోద కనిపించగానే ‘‘ ఇపుడు ఏమి చెబుతావో నీవే చెప్పు ఇదిగో ఈ నీ చిన్ని కుమారుని పట్టుకొచ్చాను. నేను చెప్పేదంతా కల్లలన్నావు కదా. చూడమ్మా నీ చిన్ని కృష్ణుణ్ణి’’ అంటూ తన వెనుక దాచుకుని పట్టి తెచ్చిన పిల్లవాణ్ణి ముందుకు ఈడ్చింది. వాడు కళ్లను నలుపుకుంటూ బుడి బుడి రాగాలు తీస్తూ ముందుకు వచ్చి నిల్చున్నాడు.
‘‘ఎందుకు వేదవతి వానిని అలా అల్లరి పెడుతున్నావు. పోనీ నీకు వానికి వెన్న తినిపించాలని లేకపోతే మా ఇంటికి పంపించు నేను పెడతాను కదా. అంతలో మాత్రానికి వానిని అట్లా కొట్టడమెందుకు? వాని లేత బుగ్గలు చూడు ఎంతగా కందిపోయి ఎర్రనైనవో ’’అంటూ ఆ పిల్లవాని దగ్గరకు వచ్చింది యశోద.
యశోద మాట్లాడే మాటలు అర్థం కాక వేదవతి పిల్లవాని వైపుతిరిగింది. ఏముంది. తనుకొడుకే! ఏడుస్తున్నాడు. యశోద వాడిని ఓదారుస్తోంది. కృష్ణుడు మూతి అంతా వెన్న పూసుకుని తన తల్లి వెనక నిలబడి తననే చూస్తున్నాడు.
ఏమి జరిగిందో అర్థం కాక నోట మాట రాక నిల్చుండిపోయింది. అంతలో నందుడు వచ్చి ‘ఎంత పిల్లలు అల్లరి చేసినా ఇలా చేయతగునా అమ్మా! అల్లరి వాళ్లు చేయక నీవు నేను చేస్తామా ? అయ్యో తల్లీ పిల్లలను ఏడిపించకమ్మా!’ అంటూ నందుడు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ వేదవతి కొడుకు ఏడుపు ఆపి యశోదమ్మ పెట్టిన వెన్నను ఆరగిస్తూ తన తల్లి వంక చూస్తున్నాడు.
జరిగింది ఏమిటో జరుగుతున్నది ఏమిటో తెలుసుకోలేక తెలుసుకొన్నది అర్ధంకాక వేదవతి అయోమయంగా చూస్తున్నది. కృష్ణమాయను తెలుసుకొనడం అంత సులభమా... వెనుక నుంచి ‘కృష్ణయ్య వేదవతి వైపు చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వాడు’’ ఆ నవ్వులో ఆమెకు ఎన్నో అర్థాలు గోచరించాయి. ఆమె తన్మయత్వంతో గోపాలుని దగ్గర చేర్చుకుని ముద్దాడింది.
మరో మారు.... శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలసి బాగా ఆటలాడడం మొదలుపెట్టాడు. యశోదమ్మ స్నానం చేయించి బట్టలు తొడిగి కాటుక దిద్ది నుదుట తిలకం దిద్ది బుగ్గన చుక్క పెట్టి ముద్దులు గులుపు చిన్ని బాలునికి దిష్టి తీసి పాలుపట్టేది. ‘ఇక ఆడుకో నాన్న!’ అని అనగానే కృష్ణుడు ఎంతో అమాయకంగా‘‘సరే! అమ్మా! అలానే!’ అని అనేంతలోనే చాలామంది స్నేహితులు ‘కృష్ణా! కృష్ణా! ’అంటూ వచ్చేసేవారు. వారందరితో కలసి చిన్నికృష్ణుడు ఆడుకోవడానికి వెళ్లేవాడు. మళ్లీ యశోదమ్మనే కృష్ణుని వెతుక్కుని తీసుకొని వచ్చేది. ఇక్కడే ఉన్నట్టుగా ఉండేవాడు కన్నుమూసు తెరిచేలోపున మాయమైపోయేవాడు. యశోదమ్మకు మాత్రమే అమాయకుడుగా కనిపించేవాడు. అందరి ఇండ్లకు వెళ్లి పాలు పెరుగు దొంగతనం గా తింటుండేవాడు. తాను ఒక్కడే తినడం కాదు తన స్నేహితులకు కావాల్సినంత పెట్టేవాడు. అట్లా పెడుతూ ఎన్నో చిలిపి పనులు చేసేవాడు.

చరణ శ్రీ