Others

విమర్శలను స్వీకరిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ఎన్నో రకాలుగా అదృష్టవంతుణ్ణి. నా కన్నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన వాళ్లు కాలగర్భంలోనే కలిసిపోయారు. నాకు మాత్రం ఏ చిన్న పని చేసినా గ్రంథస్త్తం చేసి సమాజానికందించినవాడు మా జూలూరు గౌరీశంకర్. చాలామంది రాసేవారి రచనలు గ్రంథస్థవౌతాయి. వారి మ్యాన్‌స్క్రిప్ట్ చెత్తబుట్టలోనే నిలుస్తాయి. కానీ వాటిని జాగ్రత్తగా గౌరీశంకర్ పదిలపరిచాడు. అందుకే నేను బతికున్నాను. నన్ను ఉపాధ్యాయునిగా కాకుండా విద్యావేత్తగా చేశాడు. అంటే బతికించేవారు కూడా ఒకరుండాలి. చాలామంది తన అనుభవాలను పదిలంగా రాసుకుంటారు. అవి వారిలో కాలగర్భంలోనే కలిసిపోతాయి. కానీ నన్ను గ్రంథస్తం చేయటమే కాదు దాన్ని సమాజానికి కూడా తెలియపరిచాడు. పుస్తకాలుగా అచ్చువేసి వాటిని తెలుగు సమాజం చేతికి అందించాడు. నిత్యం పత్రికల్లో వ్యాసాలుగా మలిచాడు. వేలాది మంది ఉపాధ్యాయులు, పుస్తక ప్రియుల చేతుల్లోకి వెళ్లాయి. జనం చేతుల దగ్గరగా పుస్తకాలు వెతికే మంచి చెడులపై చర్చ జరుగుతుంది. ప్రతి తరం దానికంటే ముందు తరం చేసిన పనులను విశే్లషణ చేస్తుంది. కొన్ని సార్లు కటువుగానే విమర్శ వస్తుంది. పాఠకులకున్న హక్కు అది. ఒక కార్యంలో విజయం సాధించాలంటే ఎన్నో ఇబ్బందులు పడవలసి ఉంటుంది. ఎన్నో నిర్ణయాలు చేయవలసి వుంటుంది. ఆ నిర్ణయాలన్నింటినీ వచ్చే తరానికి తెలియక కొన్నిసార్లు కఠినమైన విమర్శలు కూడా చేస్తారు. దానితో కృంగిపోకూడదు. వాటిని స్వీకరించాలి. కానీ ఏ కొద్దిమందికో ఈ అవకాశం ఉంటుంది. నాకన్నా ఎక్కువగా త్యాగాలు చేసినవారికి ఈ గౌరీశంకర్ లాంటివాళ్ళు దొరకలేదు. ఒకవేళ దొరికినా అవి గ్రంథస్థం కాలేదు. ఎక్కడో గ్రంథస్థం అయినా అవి ప్రజల చేతులకు పోలేదు, అచ్చుకు నోచుకోలేదు. ఒక మనిషికి విద్యారహస్యాలు ఎన్నో శక్తులపై ఆధారపడి వుంటాయి. నాకు అరుదైన అవకాశాలు దొరికాయి కాబట్టే చర్చనీయాంశం అయ్యాను. అది ఆ తరానికుండే హక్కు. ఆ విమర్శలన్నింటిని కూడా సహృదయంతో స్వీకరిస్తారు.

***
ఒక చెడును ముందుగా గుర్తించటం, దాన్ని బాగు చేయటానికి ప్రయత్నించటం, అందుకోసం పాలకులుగా, దానిపై చట్టం తేవటానికి సిద్ధపడటం మంచి పని. హైదరాబాద్ నగరం, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేని ఫ్లెక్సీలను నిషేధించేందుకు చట్టం తేవటానికి ప్రయత్నించటం అభినందించదగినది. ఫ్లెక్సీలు మొదలైనపుడు అదొక పెద్ద విప్లవం. కానీ ఆ తరువాత తెలిసింది అవి పర్యావరణానికి హాని చేస్తాయని. ప్లాస్టిక్ వాడొద్దన్న దానిలో భాగంగా ఫ్లెక్సీని వాడొద్దని మంత్రి కెటిఆర్ నినాదం ముందుకు తెచ్చారు. చండీగఢ్ తరహాలో భాగ్యనగరాన్ని తీర్చిదిద్దాలన్నది ఆయన లక్ష్యం. అది మంచిదే.
చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిస్తూ తానే స్వయంగా చేనేత బట్టలను ధరించి ముందుకు వచ్చాడు. ప్రజల నాయకులు ఏం చేస్తారో చూస్తారు. మంచి పనులు చేసే నాయకులను ఆదర్శంగా తమ మనస్సుల్లో స్థిరపరచుకుని దాన్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తారు.
చేనేత వస్త్రాలను ధరించటం మన సంస్కృతిని కాపాడుకోవడం. చేనేతకు చేతులాడటంతో వృత్తిదారుల కడుపునిండుతోంది. జీవితంపై పెరిగిన ఆశ ఆత్మహత్య ఆలోచనలను అడ్డుకుంటోంది. ఇది మంచి పరిణామం.

-డా.చుక్కా రామయ్య