Others

ముక్తిసాధన ఇందుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితంలో శరీరాన్ని పోషించుకోవడానికి, కుటుంబ పరివార పోషణకు ఆవశ్యకమైన ధనార్జన కొరకు వృత్తి, ఉద్యోగ వ్యాపారాదులు ప్రతి ఒక్కరూ చేయక తప్పదు. కానిభగవద్గీత మానవుడు కర్మచేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేడని అంటుంది. అదే భగవద్గీత కర్మను నీ ప్రమేయం లేకుండా అంటే చేసేవాడు చేయంచేవాడు కూడా భగవంతుడే అని నమ్మి చేస్తే కర్మఫలం నిన్ను అంటదు అని చెప్తుంది. ధర్మప్రకారం నీవు ఉంటే భగవంతుడు నీ యందే ఉంటాడని ఎపుడైతే అధర్మం పంచన చేరుతావో, ధర్మవిరుద్ధంగా, మితిమీరిన స్వార్థంతో, నీతి నియమాలను అతిక్రమించుతావో అపుడే భగవంతుని శిక్షనుంచి తప్పించుకోలేవని చెప్తుంది. జ్ఞానం, యోగం, సిద్ధి దైవభక్తి ద్వారా భగవత్సక్తినుంచి సంక్రమిస్తాయి. అపుడు ధర్మాచరణ వల్ల ఫలితమేమిటో తెలుస్తుంది. కోర్కెలను జయించడంలో అసలైన శాంతి సంతోషం ఉందన్న అన్న అనుభవైకవేద్యమై అవగాహనకొస్తుంది. లౌకిక జీవనాన్ని సాగించే క్రమంలో మనస్సు, బుద్ధి చాంచల్యంతో ఇంతకుముందు చేసిన పనులు ఎంత వృధానో తెలుసుకొంటారు. ధర్మంతో కూడిన పనులవల్లపరమ శాంతి రుచి తెలుసుకొనగానే అధర్మమనే మాటనే వినపడదు. పలుకలేము. కనుక ధర్మమే భగవంతుడు. భగవత్తత్వ విచారణ, ఆధ్యాత్మిక జ్ఞానవికాసం, యోగం కలిస్తే ముక్తి. యోగంతో కూడిన జ్ఞాన సముపార్జనే ముక్తిసాధన.అదే మానవజన్మ కర్తవ్యం

- జి. కల్యాణి