Others

యోగము.. సాధన.. ఫలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధనా మార్గంలో సాగిపోవాలనే సాధకుడు మొదట తన శరీరానికి యోగాభ్యాసంకు ఉపకరించేటి ఆహారాన్ని నియమంగా తగుపాళ్లలో స్వీకరించాలి. తగినంత మాత్రమే భుజించాలి. విహరించే ప్రాంతాలు కూడా మనోల్లాసాన్ని కలిగిస్తూ సాధనకు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చేదిలా వుండాలి.
మరో ముఖ్యమైన విషయమేమంటే శ్వాస విధానాన్ని నిరోధించే పై శ్వాస, లోపలి శ్వాసలు వీటిద్వారా వచ్చే ఎదురు గాల్పులను నిరోధించుకోవాలి. ఇదెలాంటిదంటే రథాన్ని నడిపే సారధికి కొన్ని సమయాల్లో పొగరుబోతు గుర్రాలను రధానికి కట్టవలసి వచ్చినపుడు అప్పుడా గుర్రాలు తమ ఇచ్చవచ్చినట్టు వక్రమార్గంలో కూడా పరుగులెత్తుతాయి. అలాంటి సమయంలో సారధి ఎంతో అప్రమత్తతతో నైపుణ్యంతో, అనుభవంతో వాటి గమనాన్ని నిరోధింపచేస్తూ సరైన మార్గాన నడుపు విథంగా అని తెలుసుకోవాలి. అంటే సాధకుడు రౌతులాంటి వాడు. గుర్రాలంటే ఇంద్రియాలని గ్రహించాలి. ఇంద్రియాలను సాధకుడెంతగా తన అధీనంలో వుంచుకుంటాడో అంత తావు వరకు గుర్రాలు గతులలో పడినా, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో పడినా రథానికి ఏమాత్రం ప్రమాదం జరగనీయక ముందుకు సాగింప చేస్తాడు. ఇప్పటి వరకు యోగ సాధనకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు మాత్రమే తెలియజేయబడినవి. ఈ జాగర్తలను క్రమబద్ధీకరంగా పాటించిన తరువాత సాధనలో కలుగు విషయాలను గ్రహించాలి.
ఆరంభ దశలో యోగాభ్యాసాన్ని ప్రారంభించిన వారికి మంచు, పొగ, సూర్యుడు, గాలి, అగ్ని, చిన్న చిన్న వెలుగులు చిలకరించు మిణుగురు పురుగుల వంటివి, ఆకాశమందలి మెరుపులు, చంద్రుడు, స్పటికము వంటి కొన్ని కొన్ని రూపాలు కనిపిస్తాయి. ఇది శుభ సూచకాలు. పూర్వం రైలు వచ్చేముందు పది నిముషాల్లో వస్తందని సూచించే రైలు గంటవంటిది. ఇక్కడ సాధకుడు ఒక విషయం తప్పక తెలుసుకోవాలి. విషయం తెలుసుకుని యోగ సాధన ప్రారంభించగానే ఈ ఈ గుర్తులు కనిపించడానికి కుతూహలం చూపిస్తారు. ఇది సరియగు విధానం కాదు. చాలా క్రితం విద్యావిధానంలో లెక్కల పుస్తకంలో చిట్టచివరి పేజీలో ఆన్సరు వుండేది. అంటే నీవు చేసిన లెక్క సరిగా చేస్తే రావాల్సిన జవాబది అని తెలిపే సూచికను గ్రహించిన విధంగానే ఇక్కడా మనం గ్రహించాలి.
నీ సాధన సక్రమంగా సాగితే ఇలా వుంటుందని కృష్ణ యజుర్వేదోపనిషత్ హెచ్చరించింది. ఇలా కన్పిస్తే నీ యోగసాధన ఫలించి అతి త్వరలో నీ లక్ష్యాన్ని చేరగల్గుతావను హామీనిస్తుంది. బ్రహ్మ సాక్షాత్కారమే లక్ష్యంగా వున్నప్పుడు శరీరానికి యోగాభ్యాసం సిద్ధించినపుడు అతని యొక్క శరీరం యోగాగ్నిమయంగా మారిపోతుంది. సాధకుడి శరీరం కాలిపోతుంది. ఇలాంటి స్థితిలో అతనికెలాంటి శారీరక ఇబ్బందులు, రోగాలు, ముసలితనం బాధలు, అపమృత్యు భయాదులు వుండవు. జీవుడు ఆ తర్వాత జ్యోతి స్వరూపంగా మారిపోయి జన్మరాహిత్యాన్ని పొందగలిగి ఆ పై వచ్చే ప్రయోజనాలను సిద్ధించుకుంటాడు.

- డా.జి.సాయివరప్రసాదరావు