Others

తరగతి గది.. మాతృమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది సాన్నిహిత్యంతో కంకరరాళ్లు సాలగ్రామాలవుతాయి. అమ్మాయి పుడితే తలవంచుకునే తండ్రులు, అత్తవారింటి నుంచి చివాట్లు తినే తల్లులు ఈనాడు తక్కువే. ఇప్పుడు ఏ అమ్మాయిని కదిలించినా నువ్వు జీవితంలో ఏమవుతావంటే కలెక్టరనో, డాక్టర్‌నో, నర్సునో, ఉపాధ్యాయురాలినో అవుతానంటుంది. తన దేశంలో ఉపాధి దొరకకుంటే ఇతర దేశాలకు కూడా వెళ్లి ఉద్యోగం చేస్తూ మగవారి మాదిరిగానే సంపాదించే యోగ్యురాళ్లుగా ప్రపంచం ముందు నిలుచున్నారు. ఆడపిల్ల అనగానే బాధపడే రోజులు పోయాయి. తండ్రి ఆ బిడ్డను డాక్టర్ చేస్తానని అంటున్నారు. ఇవి కధలు కావు. తండ్రి కన్న కలలను అమ్మాయిలు నెరవేరుస్తున్న కాలమిది. ఆడపిల్లలు కేవలం సంపాదించే యంత్రాలుగా మాత్రమే లేరు. సమాజంలో అణగారిన మనుషులను వెలికి తీసి ప్రపంచం కళ్లు తెరిపిస్తున్నారు. చాలామంది అమ్మాయిలు ఈనాడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. సామాజిక రుగ్మతలపై పోరాడుతున్నారు. వైద్య సహాయానికి ప్రభుత్వం కేటాయించిన సొమ్ము యోగ్యులకు అందుతోందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. డిజిటల్ యుగంలో డేటా ఎంతో ప్రధానమైంది. ఆ డేటాను అమ్మాయిలు చదువుకుని నిజానిజాలను బైటపెడుతున్నారు. అటు ఇనె్వస్టిగేటివ్ జర్నలిజంలో చాలామంది ఆడపిల్లలు బైటపెడుతున్న యదార్ధాలు ప్రపంచానే్న విస్మయానికి గురి చేస్తున్నాయి. నైజీరియా, దుబాయ్, ఆఫ్రికా, లండన్, అమెరికా పలు దేశాలకు మహిళా నర్సులు , మహిళా డాక్టర్లు వెడుతున్నారు. గొప్ప మానవతా మూర్తులుగా తమ సేవలను ప్రపంచానికి అందిస్తున్నారు.
తరగతి గది సమాజంలో సగభాగమైన మహిళలను తీర్చిదిద్ది ప్రపంచానికి గొప్ప మానవ వనరులుగా అందిస్తుంది. తరగతి గదిలో తీర్చబడిన వాళ్లు అసమానతలను తుడిచిపారేసే శక్తులుగా తయారవుతున్నారు. తరగతి గది పితృస్వామిక వ్యవస్థకు ఉద్వాసన పలుకుతుంది. ఇది పెద్దమార్పు. ఇది గొప్ప విప్లవం. తిరుగులేని సామాజిక మార్పునకు రూపం తరగతి గది. తరగతి గదికి జండర్ విచక్షణ ఉండదు. అందుకు సమాజంలో లింగ వివక్షను తడిచేస్తుంది. విజ్ఞానంతో మానవతా మూర్తులుగా తరగతి గది తీర్చిదిద్దుతుంది.
తరగతి గది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దానికుండే గొప్పతనాన్ని తరగతి గదిలో 40మంది 40 నేపథ్యాలనుంచి వస్తారు. కానీ ఈ భిన్నత్వంలో నుంచి ఏకత్వాన్ని కనుక్కోవడం గొప్ప ప్రజ్ఞ అవుతుంది. అది తరగతి గదికే సాధ్యం. ఉపాధ్యాయులు వీరందరికి శిఖరాగ్రమైన ఎత్తులో వుంటారు. అది ఎతె్తైన కెరటం. కానీ తరగతి గదికి వచ్చేవరకు ఏం మహిమో ఏమో కానీ అందరిలో ఒకడైపోతాడు. అందర్నీ కూడగట్టుకుని ఎవర్నీ నిస్పృహ చెందనివ్వకుండా పిల్లల్లో దాగివున్న ప్రతిభను మేలుకొలుపుతారు. గమ్యాన్ని చేరే వరకు విశ్రమించరు. పిల్లలు అందరిలో కూడా ఏదో ఒక రకమైన ప్రతిభ ఉంటుంది. కానీ దానిని మేలుకొలిపే మనిషి తరగతి గది. తరగతి గదికి ఆలస్యంగా వచ్చే మనిషిపైననే ప్రేమ ఎక్కువ. ఆలస్యంగా వచ్చేవారిని లేపడం, భవిష్యత్తుకు తానేకర్త అన్న దాన్ని రగిలించే పని ఉపాధ్యాయులు చేస్తారు. గ్రామాల్లో వున్న పంతులను చూడగానే దండం పంతులు అంటారు. ఆ బాధ్యతను ఉపాధ్యాయుడు మరువకూడదు.

-చుక్కా రామయ్య