AADIVAVRAM - Others

కళ్లు తెరిపించిన కానుక (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణ్, కిరణ్ ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్లిద్దరూ ఒకే బడిలో ఐదవ తరగతి చదువుతున్నారు.
ఇటు చదువులోనూ, అటు ఆటపాటల్లోనూ, అన్నింటిలో ఇద్దరూ ఇద్దరే అన్నట్లు పోటీ పడుతూ మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇద్దరిలో ఒకరు ఏ కారణం చేతనైనా బడికి రాకపోతే, మరొకరు ఆ రోజు తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలనీ, నోట్సులనీ జాగ్రత్త రాసి వాటిని మిత్రుడి ఇంటికి వెళ్లి మరీ అందించేవారు.
వాళ్ల స్నేహం చూసిన వాళ్లంతా మిత్రులంటే ఇలా ఉండాలి అనుకునేవారు.
మాస్టర్లు కూడా వాళ్లిద్దరినీ ‘ఏరా జంటకవులూ..’ అంటూ అభిమానంగా పిలిచేవారు.
అరుణ్ లెక్కల్లో మంచి దిట్ట.. కిరణ్‌కి సైన్సంటే భలే ఇష్టం. వాళ్లిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సందేహాలు తీర్చుకుంటూ మంచి మార్కులు సంపాదించేవారు.
ఒకరోజు అరుణ్ వాళ్ల బాబాయ్, అతడి కోసం కలకత్తా నుండి ఒక వాచ్ కొని తీసుకొచ్చాడు.
ఆ వాచ్‌కి ఒక ప్రత్యేకత ఉంది. దానిలో చిన్న ప్రొజెక్టర్ ఉంది. బటన్ నొక్కగానే గోడ మీద రంగురంగుల కార్టూన్ బొమ్మలు పెద్ద సైజులో కనపడేవి. స్నేహితులంతా వాచ్‌ని చూసి భలే ఉందంటూ మెచ్చుకున్నారు. కిరణ్ కూడా ‘నాకీ వాచీ భలే నచ్చిందంటూ’ దానితో చాలాసేపు ఆడుకున్నాడు.
కిరణ్‌కి తనకి కూడా అలాంటి వాచీ ఉంటే బాగుండేది అనిపించింది. పిల్లలందరూ అరుణ్ చుట్టూ మూగి దానిని గొప్పగా చూస్తూంటే కిరణ్‌కి తొలిసారి అసూయ పుట్టుకొచ్చింది.
అంతేకాదు దానిని ఎలాగైనా దొంగిలించి తనది చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది.
అరుణ్ పరాకుగా ఉన్న సమయం చూసి కిరణ్ ఆ వాచీని తన జేబులో దాచేశాడు.
‘వాచ్ పోయిందంటూ’ కంగారుగా వెదుక్కుంటూన్న అరుణ్‌తో కలిసి తను కూడా వెదుకుతూ తనకి ఏమీ తెలియనట్టు నటించాడు కిరణ్.
అరుణ్ ఆ వాచీ గురించి వెదికివెదికి ‘పోతే పోనీలే’ అనుకుంటూ ఆ తరువాత మర్చిపోయాడు.
ఒకరోజు కిరణ్ పుట్టిన రోజు పార్టీకి మిత్రులందరినీ ఇంటికి పిలిచాడు. ఆ పార్టీలో అరుణ్ తన మిత్రుడికి పుట్టినరోజు కానుకగా ప్రొజెక్టర్ వాచ్ ఇచ్చాడు. ఆశ్చర్యపోతూ దానివైపు చూస్తోన్న కిరణ్‌తో ‘ఒరేయ్ నీకు ఈ వాచ్ బాగా నచ్చిందన్నావుగా. అందుకే మా బాబాయ్‌తో చెప్పి మళ్లా రెండు వాచీలు కలకత్తా నుంతి తెప్పించా... నీకొకటి.. నాకకొటి.. అంతేకాదు ఈసారి ఏది తెచ్చినా రెండేసి తెమ్మని మా బాబాయ్‌కి చెప్పా?’ అన్నాడు అరుణ్.
కిరణ్‌కి తన స్నేహితుడి మంచితనాన్ని, తన మీద అతడికున్న అభిమానాన్ని చూసాక తను చేసిన పని ఎంత పెద్ద తప్పో తెలిసొచ్చింది. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చి, ‘ఒరేయ్.. అరుణ్ సారీరా?!...’ అంటూ తను వాచ్ దొంగిలించిన విషయాన్ని అందరి ముందూ చెప్పి లెంపలేసుకొని.. ఇంకెప్పుడూ మళ్లీ జీవితంలో ఇలాంటి తప్పు చేయనంటూ ప్రమాణం చేశాడు.
అతడిలో వచ్చిన మార్పుని చూసి అందరూ అభినందించారు.
ఆ తరువాత వారి స్నేహం మరింత బలంగా కొనసాగింది.

-గరిమెళ్ల నాగేశ్వరరావు