AADIVAVRAM - Others

డిజిటల్ భాష తెలీక ఒంటరితనం! (విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృద్ధాప్యం కొందరికి ఒంటరితనాన్ని తెచ్చిపెడుతోంది. సమాజంలో వచ్చిన మార్పులు, చిన్నకుటుంబాల వ్యవస్థ పెద్దవారిని బాధిస్తోంది. కాలానుగుణంగా వచ్చిన మార్పులు ఒకపట్టాన వారికి అలవాటు కాకపోవడం వారిని మరింత ఒంటరిని చేస్తోంది. ఆధునిక సమాజంలో ఇప్పుడు ‘డిజిటల్ లిటరసీ’కి ప్రాధాన్యం పెరిగిపోయింది. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వినియోగం ఎక్కువైపోయింది. దాదాపు అన్ని పనులు వీటిద్వారానే చేసేస్తున్నారు. చిన్నవారు, మధ్య వయస్కులు వీటికి బాగా అలవాటుపడిపోయారు. అయితే వారికి డిజిటల్ అక్షరాస్యతపై పట్టు త్వరితంగానే చిక్కుతోంది. పరిసరాలు, అవసరాలు వారిని అలా తయారు చేస్తున్నాయి. అయితే ఈ డిజిటల్ లిటరసీ అర్థంకాక వృద్ధులు మరింత ఒంటరితనాన్ని భరించాల్సి వస్తోంది. మిగతావారు వారిని దూరంగా ఉంచడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. ఏజెవెల్ ఫౌండేషన్ ఈ సర్వేను నిర్వహించింది. కంప్యూటర్, డిజిటల్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల అందరికీ దూరమవుతున్నామన్న భావనను 85.8 మంది వృద్ధులు వ్యక్తం చేస్తే వారిలో 76.5శాతం మంది పురుషులు. 96 శాతం మంది మహిళలు ఉన్నారు. దాదాపు 5వేల మంది వయసుమళ్లినవారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. వీరంతా న్యూఢిల్లి కేపిటల్ రీజియన్‌లోనివారే. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకునేందుకు కంప్యూటర్ విద్య నేర్చుకునేందుకు తమకు సరైన అవకాశాలు, సౌకర్యాలు లేవని వీరిలో 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే డిజిటల్ లిటరసీ అంటే ఏమిటో తమకు అంతగా తెలియదని 41 శాతం మంది పేర్కొనడం విశేషం. అయితే ఆధునిక పరిజ్ఞానంపై పట్టు, అవగాహన లేకపోవడం వల్ల తమ అభిప్రాయాలను, ఆలోచనలను పిల్లలకు చెప్పుకోలేకపోతున్నట్లు 81 శాతం మంది అభిప్రాయపడ్డారు. డిజిటల్ వ్యవహారాలపై జ్ఞానం లేకపోవడం వల్ల తాము మరింత ఒంటరితనానికి గురవుతున్నామని, కుటుంబానికి మరింత దూరమవుతున్నామన్న భావన ఏర్పడుతోందని 82.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. పెద్దవాళ్లకు డిజిటల్ లిటరసీపై పట్టు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో సంభాషణలు చేయడం, ప్రభుత్వ పధకాలపై వివరాలు తెలుసుకోవడం, ఆన్‌లైన్ చెల్లింపులు చేయగలగడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు చక్కబెట్టుకోగలగడం, ఆన్‌లైన్‌లో వినోద కార్యక్రమాలు చూడటం వంటి విషయాలను వారికి నేర్పడం అతి ముఖ్యమని ఈ సర్వే ప్రతిపాదించింది. ఈ విషయాలను నేర్చుకోవాలన్న ఉత్సాహాన్ని 69.8 శాతం మంది వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిజిటల్ పరిజ్ఞానంతో ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే మెళకువలపై వారు ఆసక్తి కనబరిచారని సర్వే చెబుతోంది.