Others

ప్రభావమింతింత కాదయా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే కృష్ణుని ముద్దాడుతూ తన కొంగు ను కప్పి కృష్ణు ని దాచేసి ‘‘ ఏమి అమ్మలమ్మా మీరు మీకు కూడా కొడుకు వున్నారు కదా. నేను ఎప్పుడైనా మీ కొడుకులపై నిందలు మోపానా? పోయిరండమ్మా! నాకొడుకు అమాయకుడు మీరు చెప్పేవన్నీ మీకొడుకులు చేస్తున్నారేమో చూసుకోండి. మా ఇంట్లో ఏమైనా పాలు పెరుగు తక్కువ ఉందా మీ ఇంటికి రావడానికి చాలు చాలు ఇక ఈ నిందలు ఆపి వెళ్లిరండి ’’ అని వారితో చెప్పేసి వారు మాట్లాడడానిక ఇంకో అవకాశం రాకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది యశోదా.
వారంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకొంటుంటడగా అల్లంత దూరంలో వారికి కృష్ణుడు కనిపించాడు. పకపకా నవ్వుతూ ‘‘ఏమి జరిగింది. నాపై చెబ్దామని వచ్చారా? చూడండి ఇపుడు మిమ్ముల్ను ఏం చేస్తానో అంటూ ’’ అక్కడి నుంచి పరుగెత్తి వెళ్లాడు.
వారంతా గబగబా ఇండ్ల కు వెళ్తుండగానే వారి మగవారు వచ్చి ‘‘ఇల్లు వదిలేసి కబుర్లు చెప్పుకోవడానికి వెళ్లారా! కోతులు వచ్చి ఇళ్లన్నీ ఎలా చేసి వెళ్లాయో చూడండి. మీరు ఆ మాత్రం తలుపులు వేసుకొని వెళ్లాలన్న ధ్యాస కూడా లేకుండా ఎటు వెళ్లారు. ఏమి చేస్తున్నారు. ఒక్క చుక్క నీరైనా తాగుదామంటే లేదు. కనీసం నీళ్లు కూడా తేకుండా ఎటు వెళ్లి ఏ రాచకార్యంబు చేసి వస్తున్నారు ’’ అంటూ అందరినీ గదమాయించారు. ఇదంతా ఆ కృష్ణుని పనే అనుకొన్నా రీ గోపకాంతలు.
అట్లా రేపల్లె అంతా ఒక్కటి చేస్తూ ఆడుకుంటున్నాడు. అందరినీ ఆటపట్టిస్తున్నాడు.
శ్రీకృష్ణుడు గోపకాంతలు అందరూ వచ్చి తన మీద చాడీలు చెబుతుంటే ఎంతో వౌనంగా అసలేమీ తెలియని అమాయకుని లాగా తల్లి ఒడిలో చేరి ఆడుకుంటున్నాడు. అతడిని పట్టి తెచ్చి చూపాలనుకొన్న వేదవతి కూడా చూపలేకపోయింది. దానితో మరింత గారాలు పోతూ చిన్న కృష్ణుడు తన స్నేహతులతో ఆటలు పాటలల్లో మునిగిపోయినట్లు ఉన్నాడు. యశోదాదేవికూడా తన ముద్దుల కొడుకు పెద్దవాడు అవుతున్నాడుకదా అందుకే ఇక ఏమీ అల్లరి పనులు చేయడులే అనుకొని తన పని తాను చేసుకొంటూ ఉంది.
ఒకరోజు బలరాముడు, సుధాముడు,శ్రీకృష్ణుడు ఆడుకొంటున్నారు. అంతలో కృష్ణయ్య దూరంగా వెళ్లి మన్ను గుప్పిట తీసుకొని నోటిలో పోసుకొని తింటున్నాడు. అది బలరాముడు చూచాడు. సుధాముడితో చెప్పాడు. అవును నిజమే ఈ కృష్ణుడేమిటి మన్ను తింటున్నాడనుకొని దగ్గరకు వెళ్లారు. వారిద్దరూ మన్ను తినకూడదని కృష్ణునికి చెప్పారు. అయినా వారి మాట వినకుండా కృష్ణుడు మరో గుప్పిట మన్ను ను నోటిలో పోసుకొన్నాడు.వారిని తినమని ఎంతో బాగుందని చెప్పాడు. వారి మాట వినని కృష్ణుడు బలరాముడు గదమాయించాడు. కాని తమ్ముడు మాట వినలేదు. దాంతో బలరామునికి కోపం వచ్చింది. ‘ఉండు నీ పని చెప్తాను. ఇలా కాదు’ అంటూ ఆ మట్టి చేతులతోనే తమ్ముడిని ఒడిసి పట్టుకొన్నాడు. ‘పద అమ్మదగ్గరకు వెళ్లి నీ పని చెబుతాను ’అంటూ బరబరా ఈడ్చుకుని కృష్ణుడిని ఈడ్చుకొని వెళ్లాడు. కృష్ణుడు కన్నీరును కళ్లల్లో నింపుకుని అన్న బలరాముని వెంట వెళ్లాడు. బలరామ సుధాములు కృష్ణుడు మన్ను తింటున్నాడని యశోదకు చెప్పారు. యశోద కృష్ణుని దగ్గరగా పట్టుకొని ‘ఏమిరా! ఎపుడూ ఏదో ఒక పని చేస్తుంటావు. మన్ను తినడమేమిటి? ఇంట్లోనీకు తినడానికి ఏమీ కనిపించలేదా? ’అని కోపంగా అడిగింది.
నిజంగా అమ్మకు కోపం వస్తే భయపడే పిల్లవానిలాగే కృష్ణుడు ‘అమ్మా! వీరిద్దరూ అబద్ధాలు చెబుతున్నారు. నేనిప్పుడే కదా నీ వద్ద పాలు తాగి వెళ్లాను. ఇదిగో నా బొజ్జచూడు నిండుగా ఉంది. నేనెందుకు మట్టి తింటాను. నేనమన్నా వెర్రి వాడినా ఏమిటి? వీళ్లు అన్ని ఉత్త అబద్దాలే ఆడుతున్నారు. అమ్మా అమ్మా ఇలా అబద్ధాలాడితే కనులు పోతాయి కదా’ అని అమాయకంగా అడిగాడు. బలరాముడు తమ్ముడు అన్నీ అబద్దాలు చెబుతున్నాడు. కావాలంటే వాడి నోరు చూడమ్మా అన్నాడు.
‘చూడు అమ్మా నిజంగా చూడు. నేను అబద్ధాలు చెబుతున్నానేమో చూడు అయినా నేనెందుకు కల్లలాడుతాను. నేను నీ బిడ్డడిని కదా’అంటూ బుంగమూతి పెట్టాడు.
యశోద ‘సరే కాని నీ నోరు నాకు చూపించు అపుడే నేను నిన్ను నమ్ముతాను. లేకుంటే మీ అన్న బలరాముడు నీమీదెందుకు పితూరీలు చెబుతాడు చూపించు నీ నోరు’ అని గట్టిగా తన ఒడిలో కృష్ణుని బంధించి మరీ అడిగింది.

- చరణ శ్రీ