Others

బాలీవుడ్‌లోకి సమంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది అందాల ముద్దుగుమ్మ సమంత. ప్రస్తుతం ‘రాజుగారి గది-2’ చిత్రంలో నటిస్తున్న సమంత, నాగచైతన్యతో కొంతకాలంగా జోరు ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఈనెల 6న వీరి పెళ్లి గోవాలో సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. మరోవైపు సమంత పెళ్లి తరువాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ కోవలో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత రోణి స్క్రూృవాలా నిర్మించే చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోందట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. తాజాగా రామ్‌చరణ్ సరసన ‘రంగస్థలం 1985’ చిత్రంలో నటిస్తున్న సమంత, మరోవైపు తమిళంలో విక్రమ్, విజయ్‌ల సరసన నటిస్తోంది. మొత్తానికి సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ మరి బాలీవుడ్‌లో ఏ రేంజ్‌లో విజయం సాధిస్తుందో చూడాలి!