Others

కలుషిత జలాలతో కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపరిశుభ్రమైన నీరు, కలుషితమైన నీటిని తాగడం వల్ల బాలికలు, యువతులు అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా మూత్రసంబంధమైన ఇన్‌ఫెక్షన్‌కు గురై సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్ నియంత్రణకు వాడుతున్న యాంటీ బయాటిక్స్ వల్ల బాక్టీరియా ఆనవాళ్లు మూత్ర పరీక్షల్లో దొరకడం లేదు. కానీ, మూత్రపిండాల్లోకి బ్యాక్టీరియా వ్యాపిస్తోంది. ఫలితంగా వారికి తరచూ జ్వరం రావడం, మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం వంటి లక్షణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక వైద్యకళాశాల ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఆ కళాశాల ఆధ్వర్యంలో 248 మంది బాలికలు, యువతుల నుంచి నమూనాలు సేకరించి పరిశీలిస్తే 75 శాతం మంది యూరిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తేలింది. మరికొంత మందిలో ఈకోలి, క్లెబిసియెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఈ ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించడానికి, నిర్మూలించడానికి యాంటిబయాటిక్స్ చక్కగా పనిచేస్తాయి. మహిళల్లో ఉంటే మూత్రనాళ వ్యవస్థ ఇరుకుగా ఉండటం వల్ల తొందరగా ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. మందులు వాడినప్పుడు ఇన్‌ఫెక్షన్ తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. కానీ పూర్తిగా తగ్గదు. బ్యాక్టీరియాను నిర్మూలించడానికి చక్కటి ప్రణాళికతో ప్రభావవంతమైన ఔషధాలను వాడకపోతే అవి మూత్రపిండాల్లోకి జొరబడి అక్కడి వ్యవస్థను దెబ్బతీస్తాయి. ప్రతి పదిమంది మహిళల్లో ముగ్గురు ఇలా మూత్ర సంబంధ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నారు. పొట్టలో నొప్పిగా ఉండటం, పొత్తికడుపువద్ద అసౌకర్యంగా ఉండటం, దుర్వాసనతో కూడిన, పసుపురంగులో మూత్రం రావడం, మంట పుట్టడం వంటివి ఇన్‌ఫెక్షన్ లక్షణాలు. టాయిలెట్లు, బాత్రూమ్‌లు, వారు నివసించే ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడం, మంచినీరు ఎక్కువగా తీసుకోవడం, కాచివడబోసిన నీటిని వాడటం తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలు. మగవారితో పోలిస్తే యూరిన్ ఇన్‌ఫెక్షన్ మహిళలకు తొందరగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా యూరినటీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎక్కువగా నీటిని తీసుకోకుంటే వారు ఈ సమస్యను కొనితెచ్చుకున్నట్లే. డీహైడ్రేషన్ వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందని సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ సనంద్ బగ అంటున్నారు. సొంతవైద్యం చేసుకుంటున్నవారు, అటు అల్లోపతి, ఇటు ఆయుర్వేదం మిళితం చేసి ఔషదాలు వాడుతున్నవారి వల్ల సమస్య ముదురుతోందని సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ రామ్‌ప్రసాద్ హెచ్చరిస్తున్నారు. నిపుణులైన వైద్యుల సూచన మేరకు యాంటిబయాటిక్స్‌తోపాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మితిమీరి లేదా అవసరం లేకుండా యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల అనర్థం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

-రవళి