Others

డైటింగ్ మంచిదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుడిపై భక్తితో ఉపవాసం కావచ్చు. బరువు తగ్గాలన్న ధ్యాస కావచ్చు. కారణమేదైనాగానీ కడుపు మాడ్చటం మంచిది కానేకాదు. ఆహారం తీసుకోకపోతే దానికి బదులు ఏదో ఒకటి కొద్దిగానైనా తీసుకోవాలి. ఏదీ తినకుండా ఉంటే శరీరంలో చెక్కర స్థాయిలు పడిపోతాయి. మరీ ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కూడా మిస్ కావద్దు. దానివల్ల ఆకలి పెరిగిపోయి ఆ తరువాత ఎక్కువ కేలరీలు తీసుకునేందుకు దారితీస్తుంది. బరువు తగ్గే ఆలోచనతో డైటింగ్ చేయాలనుకునేవారు కడుపు మాడ్చటం వంటి పనులను మానుకుని కొంచెం, కొంచెం పరిమాణంలో ఆహారాన్ని రోజులో ఆరుసార్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఆహారానికి ఓ డైరీని తయారుచేసుకోవటం మంచిది. రోజూ తినే ఆహార పదార్థాల వివరాలను డైరీకెక్కించాలన్నది నిపుణుల సలహా. దీనివల్ల ఎంత మేర తింటున్నాం అన్నదానిపై అవగాహన ఉంటుంది. దీంతో ఆహారంపై నియంత్రణ సాధ్యం అవుతుంది. నిజానికి మనం తీసుకున్న ఆహారం జీర్ణవ్యవస్థలో సాఫీగా అరిగిపోయే విషయంలో ఎన్నో అంశాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ఓ పండును ఉదయం తీసుకుంటే ఆది జీర్ణవ్యవస్థలో ఇబ్బందులకు కారణం కావచ్చు. అదే పండును మధ్యాహ్నం తీసుకుంటే సాఫీగా అరిగిపోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందనేది ఆయా పదార్థాల్లోని గుణాలు, పోషకాలతో పాటు వాటి కారణంగా విడుదలయ్యే రసాలు, జరిగే క్రియలను బట్టి ఉంటుంది. వీటి వల్ల హార్మోన్ల మార్పులు కూడా సంభవించవచ్చు. కాబట్టి డైటింగ్‌ను జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది.