Others

ఇల్లే మొదటి తరగతి గది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఎన్ని వృత్తులు ఉన్నా ఉపాధ్యాయ వృత్తికి ప్రపంచమంతా ఎందుకు ప్రాధాన్యతనిస్తుంది. మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఆ వృత్తికి ఉంది. ఉత్తమ సమాజ నిర్మాణం, ఉన్నతమైన వ్యక్తిత్వాలు, గుణగణాలతో పౌరుడిని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. మనకన్నా పాశ్చాత్యులు పరిశోధనపైన ఎక్కువ మక్కువ చూపిస్తారు. దానికి కారణం చిన్నప్పటి నుంచే పిల్లల్లో చక్కటి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తూ ఉంటారు. ఆ వ్యక్తిత్వమే క్రమంగా ‘సౌశీల్యం’గా మారుతుంది. ఇతర దేశాల్లో ఎంతోమంది విద్యార్థులు, చిన్నపిల్లలతో మాట్లాడే అవకాశం నాకు దొరికింది. వారిలో ఎంత ఆత్మవిశ్వాసం కనపడుతుందంటే ఎంత కఠినమైన పరీక్షలనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్లు చేసే సర్వసాధారణ పనులు గొప్ప వ్యక్తుల గుణగణాలకు అద్దం పడుతుంటాయి. ఎలాంటి పరిస్థితులలోనైనా అబద్ధం ఆడరు. సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితేనే విజయం తథ్యమనుకుంటారు. నెమ్మదిగానైనా సరే మనం విజయం సాధించక తప్పదు అనుకుంటారు. ఇలాంటి శిక్షణను పిల్లలకు తల్లిదండ్రులు తమ జీవితంలో చూపిస్తారు. తల్లిదండ్రులంటే భయంకన్నా ప్రేమ గౌరవం ఎక్కువగా వుంటుంది. వ్యక్తిత్వ నిర్మాణంలో అది చాలా అవసరం. తల్లిదండ్రులంటే పిల్లలకు భయం ఉండకూడదు. అదే మనిషిని వెలుగులోకి తీసుకువస్తుంది. తల్లిదండ్రులు శీల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహిస్తారు. సౌశీల్యమే (గుడ్ క్యారెక్టర్) జాతికి ప్రాణం. పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులని మరిచిపోవద్దు. ఇల్లే మొదటి తరగతి గది. అక్కడే శీల నిర్మాణం జరుగుతుంది. వ్యక్తిత్వ నిర్మాణానికి బలమైన పునాదులు పడతాయి.
ఉపాధ్యాయుడు కనపడని శక్తి
మనిషి పరిపూర్ణ విజయం వెనుక ఉపాధ్యాయ వృత్తిలో ఆనందం పొందాలంటే నిస్వార్థత, ప్రతిఫలాన్ని ఆశించకపోవటం ప్రధానం. ఉపాధ్యాయుడు జీవిత రహస్యం చెబుతున్నపుడు విద్యార్థి ఏవౌతాడని ఆలోచించడు. ప్రతిఫలం అనేది ఆ విద్యార్థి సాధించిన శ్రమ. విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయులు భాగస్వామి కావటం మంచిదే. కానీ దాని నుంచి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ప్రతిఫలం ఆశిస్తే మనం చేసే పనికి సంపూర్ణత రాదు. ఈ ఆలోచనా విధానంపై బుద్ధిని వికసింపజేస్తే ఉపాధ్యాయులు మరింత విస్తృతిని పొందుతాడు. అందుకే ఒక ప్రభుత్వ స్వరూపంతో ఆ దేశం స్థితిగతులను చెప్పవచ్చును. ప్రభుత్వంతో వుండే మనుషులను చూసి, వారి విధానాలు చూస్తే పాలనా స్వరూపాన్ని చెప్పవచ్చును. ప్రభుత్వం ఏర్పాటుచేసే శక్తుల స్వరూపాన్ని ఆ ఉపాధ్యాయులతో అంచనా వేయవచ్చును. ఒక జాతి స్వరూపాన్ని ఉపాధ్యాయులే నిర్ణయిస్తారు. ఉపాధ్యాయ వృత్తి ఆకలి తీర్చుకోవడానికి బతకటానికి కాదు. దానికి తరగతి గదికి దగ్గరి సంబంధం ఉంటుంది. ఉపాధ్యాయుడు తరగతి గది కాకపోవచ్చును. కానీ దానికి శోభను తీసుకురాగలడు. తరగతి గదికి కనపడని శక్తి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు, కనపడే శక్తి విద్యార్థి.

-చుక్కా రామయ్య