Others

తలవంచిన వైకల్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలెగ్జాండర్ కుతాస్ తొలి వీల్‌చైర్ ఫ్యాషన్ మోడల్. ఈమె కోసం ఫ్యాషన్ డిజైనర్లు ప్రత్యేకంగా దుస్తులు తయారుచేస్తుంటారు. వీల్‌చైర్‌లో ఫ్యాషన్ డిజైనర్లతో కలసి ఆమె క్యాట్ వాక్ చేస్తూ ప్రేక్షకులు హృదయాలను దోచుకుంటుంది. ఉక్రెయిన్‌లో జరిగే ప్రతి ఫ్యాషన్ పండుగలో అలెగ్జాండర్ పాల్గొనకుండా జరగదంటే అతిశయోక్తి కాదు. ఉక్రెయిన్‌లోనే కాదు నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్యాషన్ మోడల్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇరవై మూడేళ్ల అలెగ్జాండర్ పుట్టుకతోనే వెన్నుపూస దెబ్బతినటంతో నడవలేదు. దీంతో పుట్టుకతోనే వీల్‌చైర్‌కు పరిమితమైంది. ఏనాడూ తన అంగవైకల్యం గురించి చింతిస్తూ కాలం వెళ్లదీయలేదు. ఆమె మోడల్‌గా ఎదగటానికి తీవ్రంగానే కృషిచేశారు. ఆమె మనసే కాదు ముఖం కూడా అందంగా ఉంటుంది. అలెగ్జాండర్‌కు మోడల్ అవ్వాలనే కోరిక 16 ఏళ్ల వయసులో కలిగింది. ఓ రోజు రెస్టారెంట్‌లో ఉండగా.. ఓ ఫొటోగ్రాఫర్ వచ్చి ఆమెను ఓ ఫొటో తీసుకుంటానని కోరాడు. సరేనని అన్నది. అంటే తనకు వైకల్యం ఉన్నా.. అందంలో ఇతరులతో ఏమాత్రం తీసిపోనని గ్రహించిన అలెగ్జాండర్ వీల్‌చైర్‌లోనే ఫ్యాషన్ పండుగల్లో పాల్గొని క్యాట్‌వాక్ చేయాలని సంకల్పించి అందుకు అనుగుణంగా తనను తాను మలుచుకుంది. వైకల్యం ఉన్నా.. తనవంటివారు అందంలో ఏమాత్రం తీసిపోరంటూ ప్రపంచానికి చాటేందుకు.. అలాగే అంగవైల్యంతో బాధపడేవారికి స్ఫూర్తినిచ్చేందుకు ఫ్యాషన్ వీక్‌లలో పాల్గొనాలని భావించింది. తొలుత చాలా ఏజెన్సీలను సంప్రదించింది. కాని చాలామంది ముఖం చాటేశారు. ఎందుకంటే కాళ్లులేకుండా వీల్‌చైర్‌లో కూర్చుని దుస్తుల అందం ప్రదర్శించటం సాధ్యంకాదని ముందుకురాలేదు. చివరకు ఎన్నో ప్రయత్నాల ఫలితంగా ఆమె వీల్‌చైర్ మోడల్‌గా నేడు రాణిస్తోంది. ఇటీవల ఇండియా రన్‌వే వీక్ ఫ్యాషన్ షోలో బ్లూకలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. క్యాట్‌వాక్ చేస్తుంటే చప్పట్లతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. ఫ్యాషన్ మోడల్‌గా రాణించాలనే కలను సాకారం చేసుకుంటూ తనలాంటి అంగవైకల్యంతో బాధపడేవారిలో స్ఫూర్తిని నింపుతున్న అలెగ్జాండర్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
నడక దిద్దిన జీవితం..