Others

కోడిగుడ్డుతో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌకైన పౌష్టికాహారం * నేడు ప్రపంచ గుడ్డు దినోత్సవం
అతి చౌకగా లభించే పౌష్టికాహారం ఏదంటే కోడిగుడ్డు అని చెప్పవచ్చు. ఒక గుడ్డులో 300 మైక్రోగ్రాముల కొలైన్ వుంటుంది. ఒక గుడ్డు తినడంవల్ల శరీరానికి ఉపయోగపడే హెచ్.డి.ఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టడాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తనాళాలు, గుండె వ్యాధులు దరిచేరవు. కంటి సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. ఇది మెదడు పనితీరుకు, నరాల వ్యవస్థ బలంగా ఉండడానికి దోహదం చేస్తుంది. వారంలో కనీసం ఆరు కోడిగుడ్లు తింటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు 44 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. క్షయవ్యాధిగ్రస్తులు, బాలింతలు, గర్భిణులు, కాలేయ వ్యాధిగ్రస్తులు రోజూ గ్రుడ్డు తింటే మంచిది. ఒక గుడ్డులోని తెల్లసొనను కప్పు పాలలో కలిపి, దానికి రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే శరీరంలోని విష పదార్థాలకు విరుగుడు లభిస్తుంది. ఇలా ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడంవల్ల శారీరక బలం పెరిగి టానిక్ వలె ఉపయోగపడుతుంది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ నిత్యం కోడిగుడ్డును ఆహారంలో తీసుకోవాలి. ఎదిగే పిల్లలకు గుడ్డు శక్తిని అందిస్తుంది. నేటి కాలంలో కూడా కోడిగుడ్డును తీసుకోనివారు ఉన్నారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో గుడ్డు, కోడిమాంసం తలసరి వినియోగం బాగా తక్కువ వుందని చెప్పవచ్చు. దేశ జనాభాలో 25 శాతంగా వున్న పట్టణ ప్రాంత ప్రజలు ఏటా సగటున 100 కోడిగుడ్లను వినియోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఏటా సగటున 20 గుడ్లను మాత్రమే వినియోగిస్తున్నారు. పౌల్ట్రీ రంగంలో దేశంలో మన తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నా తలసరి వినియోగంలో మన రాష్ట్రం కూడా వెనుకబడి వుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇకనైనా కోడిగుడ్డును విరివిగా తీసుకుందాం - ఆరోగ్యంగా వుందాం.

-కామిడి సతీష్‌రెడ్డి