Others

నిదుర చాలా సుఖమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలసి.. సొలసి.. ఇంటికి వచ్చి పడుకునే సమయంలో పరుపు కీలక పాత్ర పోషిస్తుంటుంది. పరుపు కరెక్టుగా లేకపోతే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. దీనితో మరుసటి రోజు నిద్రతో ఒకవైపు.. అలసటతో మరోవైపు అవస్థలు పడుతుంటారు. అందుకని చక్కటి పరువు ఇందుకు పరిష్కారం చూపుతుంటుంది. మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని సమస్యలు మరిచిపోయి హాయిగా కునుకు తీయాలంటే మెత్తని పరుపు, అందుకు తగిన బెడ్ ఉండాలి. పరువు స్కిన్‌పై కూడా ప్రభావం చూపిస్తుంటుంది. నిద్రపోయే సమయంలో చర్మం నుండి కొన్ని మృత కణాలు బయటకు వెళుతుంటాయి. ఫలితంగా పరుపులమీద బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. విటమిన్-ఈ, అలొలెరా తదితర రకాల కూడిన పరుపు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అంతేగాకుండా మృతకణాలు పెరిగిపోకుండా అరికట్టే బెడ్‌షీట్స్ కూడా మార్కెట్‌లో లభ్యవౌతున్నాయి. సుఖంగా నిద్రపోతేనే ఆరోగ్యంగా మానసికంగా స్థిరంగా ఉండగలుగుతాం. పరుపు విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. అది మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే బెడ్ బాగుంటుందో అప్పుడే హ్యాపీగా నిద్రపోగలుగుతారు. పరిసరాలను మైమరచి కునుకు తీయాలంటే మెత్తని పరువు, అందుకు తగిన బెడ్‌షీట్ ఉండాల్సిందే. దూది పరువులు, పీచు పరుపుల స్థానే ఇపుడు మార్కెట్‌లో టెక్నాలజీ పరువులు, రకరకాల బెడ్‌షీట్లు సిద్ధమై వూరిస్తున్నాయి. పడుకోగానే మెత్తగా ఉండడంతోపాటు ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మేఘాలలో తేలిపోతున్న అనుభూతినిచ్చే లేటెస్టు పరుపులు, అంతకంటే మంచి బెడ్‌షీట్లు ఇపుడు మార్కెట్‌లో లభిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా, సుఖంగా నిద్రపోయేందుకు ఇలాంటివన్నీ ఎంతో ఉపయోగపడతాయి.

-తరిగొప్పుల విఎల్లెన్‌మూర్తి