Others

అరవిరిసిన అందం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళలోని కొట్టిప్పురంనకు రైలులో వెళుతుంటే రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా ప్రయాణీకులు కళ్లు విప్పార్చి చూస్తుంటారు. కనుచూపు మేరకు గులాబీ రంగులో గుబాలిస్తున్న కలువ పూలు రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. ఈ సరస్సు పేరు విజయాపరాపూర్. కొడైకెనాల్‌కు సమీపంలో ఉండే ఈ సరస్సు దాదాపు 20 ఎకరాల్లో విస్తరించి ఉంది. హిందువులు, బౌద్ధులు ఎంతో పవిత్రంగా భావించే ఈ జాతీయ పుష్పం ఆయా మత ఆచారాలు, వేడుకల్లో తప్పనిసరి. అందుకే ఈ పువ్వుకు కేరళలో ఎంతో డిమాండ్. దేశంలోనే అతి పెద్ద కలువ సరస్సుగా ప్రసిద్ధిచెందిన ఈ పూలవనంపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. తిరునవయకు సమీపంలోని కోజీఖోడ్‌లో నవముకుందా ఆలయంలో ఈ పూలతోనే పూజలు చేస్తారు. ఒకప్పుడు జామోరిన్ల పాలన సాగుతున్నప్పటి నుంచి కలువ పూలతో పూజించే ఆచారం కొనసాగుతుంది. ఏడాదిలో ఎనిమిది నెలల పాటు ఈ పూలు వికసిస్తూనే ఉంటాయి. మండువేసవిలోనూ ఈ పూలతో నిండుగా సరస్సు కళకళలాడుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పూల మొగ్గలను కోసి ఎగుమతి చేస్తుంటారు.
పండుగ సీజన్‌లలో విపరీతమైన డిమాండ్
పండుగ సీజన్‌లలో కలువ పూలకు విపరీతమైన డిమాండ్. పూజకు ఈ పూలనే వాడుతుంటారు. దేశ విదేశాలకు కలువ పూలను సరఫరా చేయాలంటే కోజిఖోడ్ మార్కెట్ నుంచే జరుగుతుంది. తమిళనాడులోనూ కలువ పూలను పూజకు వాడుతుంటారు. పండుగ సీజన్‌లో ఒక్కొక్క పువ్వు కనీసం ఐదు రూపాయలకు తక్కువకాకుండా ధర పలుకుతుంది. కలువ పూలు పూయాలంటే కనీసం మీటరున్నర మేరకు నీరు ఉండాలి. అపుడే కలువలు వికసిస్తాయి. వేసవి కాలంలో తగినంత నీరు అందించేందుకు పొలాల్లోని నీటిని మళ్లిస్తుంటారు. బోర్ల ద్వారా సైతం నీటితో సరస్సును నింపుతుంటారు. కలుపుమొక్కలు, గడ్డి, అధిక గాలి, వర్షాలు కలువ పూలను వికసించకుండా నాశనం చేస్తుంటాయి. ముస్లింలు సైతం ఈ పూలను పెంచి పూజకు అందించటం ఇక్కడ విశేషం.