Others

పతనమవుతున్న ప్రభుత్వ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ప్రగతి విద్యారంగం అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. పేదవర్గాలు ఎక్కువగా ఉండే మనదేశంలో ప్రాథమిక విద్య వనె్న తగ్గుతూ వస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత తెలంగాణలో సమూల మార్పులు వస్తాయని, ప్రాథమిక విద్యారంగం, ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగంలో మేలైన మార్పులు జరుగుతాయని ప్రజలు ఆశపడ్డారు. మూడేళ్లు గడచిపోయాయి. మేలైన మార్పులేమీ జరగలేదు. ఇప్పటికీ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల పెత్తనం, గుత్త్ధాపత్యం సాగుతోంది. ప్రభుత్వ విద్యాసంస్థల పరిపుష్టికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. డిఎస్‌సి నిర్వహణ, పదోన్నతులు, విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా బోధకుల నియామకం వంటి అంశాల్లో ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. మరోవైపు ఇ-టెక్నో, ఒలింపియాడ్, ఐఐటి కోచింగ్ వంటి పేర్లతో పెద్దఎత్తున ఫీజులను ప్రైవేటు విద్యాసంస్థలు దండుకుంటున్నాయి. ఉత్తమ ఫలితాల సాధనలో ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రతిభ చూపడం లేదు. వౌలిక సదుపాయాలు లేకపోవడం, తగినంత మంది సిబ్బంది లేకపోవడమే అందుకు కారణం. చాలా పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రెగ్యులర్ హెడ్‌మాస్టర్లు లేరు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్న లక్ష్యం కొడిగట్టింది. ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడున్న పాఠశాలలు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రైవేటు విద్యపై మోజును పెంచుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పు రావాలి. మధ్యాహ్న భోజనం, బడిబాట వంటి కార్యక్రమాలు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. ఇంటర్ విద్యను నాణ్యంగా, మెరుగుగా అందించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే కార్పొరేట్ రంగాన్ని కట్టడి చేయడం సాధ్యం అవుతుంది. నిజానికి విద్యారంగంలో కార్పొరేట్ సంస్థలు మాఫియాగా మారిపోయాయి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే తప్ప అవి దారికిరావు. ఇక విశ్వవిద్యాలయాల పరిస్థితి ఘోరంగా ఉంది. తెలంగాణలో 13 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటికి నిధులు అరకొరగా అందుతున్నాయి. చాలావాటికి బోధనాసిబ్బంది కొరత ఉంది. చాలా విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్ల్ నియామకం జరగలేదు. కరీంనగర్ శాతవాహన వర్శిటీకి ఉపకులపతి నియామకం ఇంకా జరగలేదు. వర్శిటీలలో 1600 అధ్యాపక పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. కామన్ ఎంట్రన్స్ పరీక్షలన్నింటిని ఒకే డైరక్టరేట్ పరిధిలోకి తీసుకురావాలి. వర్శిటీ వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం పరిమితంగా ఉంటేనే మేలు జరుగుతుంది. విశ్వవిద్యాలయాలు నాక్ వంటి సంస్థల అక్రిడిటేషన్ ఉంటేనే విలువ ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రమాణాలు, సౌకర్యాలు, బోధనాసిబ్బందిని నియమిస్తూంటేనే ఆ గుర్తింపు లభిస్తుంది. తెలంగాణలో విద్యావ్యవస్థకు జవజీవాలు రావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల చర్యలు చేపట్టాలి. అప్పుడే సొంతరాష్ట్రంలో విద్యారంగానికి కొత్త సొబగు వస్తుంది.

-ఎస్.రాజేంద్రప్రసాద్