Others

మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందం, ఆస్తి ఆర్భాటం అవన్నీ అనసవరం
ప్రతిభను నమ్ముకొని కష్టిస్తేనే సత్ఫలితం
ఆరాధ్యమూర్తి నాకు అబ్దుల్ కలామ్

విద్యార్థి అంటే వికసించే విద్యాకమలం
విజ్ఞానార్జనే వినోదమైతే కదా! పరిమళం
కలామ్ బాటలో నడిస్తే అన్నింటా సఫలం

కష్టానికి చోటులేదు యిష్టంగా పనిచేస్తే
నిరాశకు తావులేదు నిరంతరం శ్రమిస్తే
ఓటమనేది లేదు కలాంనే అనుసరిస్తే

కలలుకంటూ నిద్రలోన మగ్గిపోవద్దు
సాకారం చేసుకో ఆకాశమె హద్దు
కలాంమాట జీవితాన్ని చక్కదిద్దు

విద్యార్థికి వినయమే ఆభరణం
క్రమశిక్షణే విజయానికి సోపానం
మన అబ్దుల్ కలామే తార్కాణం

నిజాయతీ నిబద్ధత నికరంగా నిలవాలి
నిస్వార్థం ఖచ్చితత్వం చక్కంగా చూపాలి
ఆ అబ్దుల్ కలామ్ మనకు ఆదర్శం కావాలి

శాస్ర్తియ జ్ఞానంతో పరిఢవిల్లు భారతం
ప్రతి విద్యార్థి కావాలి సౌశీల్యపు మరకతం
దేశప్రగతి పెరగడమే మన కలామ్ అభిమతం

-చావలి శేషాద్రి సోమయాజులు