Others

కన్యత్వానికి కారణమిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వైశ్యులలో కుసుమశ్రేష్టి కుసుమాంబ అను దంపతులు తమకు సంతానం లేదని పెద్దల చేత అనుజ్ఞ తీసుకొని పుత్రకామేష్టి యాగం చేశారు. అపుడు ఆ దంపతులకు విరూపాక్షుడు, వాసవాంబ అనువారు పుట్టారు. శచీదేవినే వాసవాంబగా పుట్టింది. వారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొనేవారు. ఆమె యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఓసారి విష్ణువర్థనుడు అను రాజు వీరున్న పెనుగొండకు వచ్చాడు. రాజుగారు వచ్చారని వైశ్యులంతా రాజుకు ఆహ్వానం పలకడానికి వెళ్లారు. శుభాశీస్సులు పలికి రాజును వారు సత్కరించారు. వారి ఆహ్వాన సత్కారాలకు మురిసిన విష్ణు వర్థనుడు వారిని ఒక్కొక్కరిని పిలిచి తాంబూలాలిచ్చి గౌరవించాడు. ఆ సమయంలో కుసుమశ్రేష్టి భార్య అయిన కుసుమాంబకుకూడా రాజు తాంబూలం ఇచ్చాడు. ఆ సమయంలోనే వాసవాంబను విష్ణువర్థనుడు చూచాడు.
చూచిన క్షణం నుంచి ఆమెను వివాహం చేసుకోవాలన్న ఆకాంక్షను పెంచుకున్నాడు. తాను వెంటనే వాసవాంబ ను పెళ్లి చేసుకోవాలనుకొంటున్నట్టు వైశ్యశ్రేష్టులకు తెలిపాడు. కాని కుసుమశ్రేష్టి తనకు సమ్మతం కాదన్నాడు. రాజు కోపం తెచ్చుకున్నాడు. పెద్దవారితో వివాదాలు వద్దని వైశ్యలంతా కలసి కొద్ది రోజుల తర్వాత వివాహ నిశ్చయం చేసుకొందామని విష్ణువర్థనునికి చెప్పి అతడిని అక్కడనుండి పంపివేశారు. ఆ తరువాత వారంతా కలసి ఎట్లాగైనా ఈ విష్ణువర్థనుని బారి నుంచి వాసవాంబను రక్షించుకోవాలని అనుకొన్నారు. అంతలో ఈ సంగతి విష్ణువర్థనుడు తెలసుకొని వీరిపైకి యుద్ధానికి బయలుదేరాడు. రాజు దండయాత్ర విషయం వైశ్యులు తెలుసుకొన్నారు.వాసవాంబ సోదరుడు విరూపాక్షుడు తెలుసుకొని విష్ణువర్థనుడు వచ్చే లోపే మనమందరం చితి పేర్చుకొని ఆత్మత్యాగం చేసుకొందాం కాని ఆ విష్ణువర్థనునికి మాత్రం నా సోదరిని ఇవ్వను అని భీష్మించుకొన్నాడు. అపుడు వారి అఘాయిత్యాన్ని వాసవాంబ ఆపింది. తన నిజస్వరూపాన్ని వారికి చూపింది. నేను శాపవశాత్తు ఇక్కడ వాసవాంబగా పుట్టాను. కాని నిజానికి నేను శచీదేవిని. ఇంద్రుని భార్య యైన ఇంద్రాణిని. కనుక ఇక ఇపుడు ఈ వాసవాంబ శరీరాన్ని నేను విడిచి పెడ్తున్నాను అంది. అలా ఆమె కన్యగానే ఉండిపోయింది. కనుక అందరూ ఆమెను కన్యకాంబ అనే పేరుతో సంభావించారు.. ఆమె నిజస్వరూపం తెలుసుకొన్న వైశ్యులంతా ఆమెను కులదేవతగా ఆరాధించారు. అలా వాసవీ కన్యకాపరమేశ్వరిగా వైశ్యులు కొలిచే దేవి శచీదేవి.
ఇలా ద్రౌపది పూర్వజన్మలు ఎన్నో వున్నాయి. ప్రతివారికికూడా పూర్వజన్మ ఉంటుందనేది కొందరి వాదన. ఎందుకంటే పుణ్యపాపాలు ఎంతో కొంత సంచయరూపంలో వస్తునే ఉంటాయి కనుక వారికి జన్మలు తప్పవని అంటారు. ఎప్పుడైతే ఈ పుణ్యపాపాలన్నీ హరించుకుపోతాయో ఏమీ మిగులకుండా పోతాయో అప్పుడు ఇక జన్మ ఏమీ ఉండదు. అంటే జన్మరాహిత్యాన్ని పొందారన్నమాట. జిజ్ఞాసపరులందరూ కూడా ఈ జన్మరాహిత్యం కోసం వివిధ పద్ధతుల్లో శ్రమిస్తుంటారనేది మనకు ఎన్నో పురాణాలు చెబుతున్నాయి.

- రాయసం లక్ష్మి 9703344804