Others

పాడుతా తీయగా...’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూగమనసులు సినిమాలోని ‘పాడుతా తీయగా’ అనే పాట అంటే ఎంతో ఇష్టం. ఘంటసాల గళంలోని ఈ పాట వింటే మనస్సుకి ఊరట వస్తుంది. ఆత్రేయ సాహిత్యం మనస్సును రంజింపచేస్తుంది.
‘జీవితంలో సుఖం లేకపోతే కనీసం నిద్ర అయనా ఉండాలి. అపుడు కలలోనన్నా సుఖపడతాం. నిద్రపట్టకపోతే కలలు పడవు. అపుడు కలలు కూడా దోచుకోబడినట్లే. పోయినోళ్ళందరూ మంచోళ్ళు (్భరతీయ సంస్కృతి). వాళ్ళను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు పోయినోళ్ళ తీపిగుర్తులు. మనిషి పోయినా మనస్సు ఉంటుంది. అది మరో మనస్సులో కలసిపోతుంది. స్నేహితులు, పోయినవాళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కాబట్టి స్నేహం ఉంటే చావు పుట్టుకలకు అర్థం లేదు.
జీవితం గురించి మనస్సు గురించి ఎంతో చక్కగా చెప్పి విషాదం నుండి బయటకు వచ్చేందుకు అవసరమైన శక్తిని ఈ పాట ఇస్తుంది. సాహిత్యం, అందులో ప్రత్యేకంగా పాట యొక్క శక్తిని విశదీకరించి పాట ప్రయోజనాన్ని చక్కగా నెరవేర్చుతుంది. ఈ పాట వింటే మనస్సు తేలికవుతుంది. జీవిత పరమార్థం బోధపడుతుంది. మనస్సు గాంభీర్యం సంతరించుకుంటుంది.
ఈ పాట పల్లవిని ఉపయోగించి బాలసుబ్రహ్మణ్యంగారు అతి పెద్ద సంగీత కార్యక్రమం ఏర్పాటుచేశారు అంటే ఈ పాట స్థాయిని అంచనా వేయవచ్చు.
మా పాప చిన్నప్పుడు ఎంత ఏడ్చినా ఈ పాట పాడితే క్షణాల్లో నిద్రపోయేది. ఘంటసాల హృదయంలోని ఆర్ద్రతను మనకు వినిపించే ఈ పాటంటే నాకెంతో ఇష్టం. రణగొణ ధ్వని లేని ప్రశాంతమైన ఈ పాట రోజూ వింటాను. అందులో కలిగే ఆనందమే వేరు.

-కందకుర్తి ఆనంద్, కోటగల్ల, నిజామాబాద్