Others

ఎం.వి.ఎస్ హరనాథరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎం.వి.ఎస్ హరనాథరావు
1948 - 2017

సినీ నాటక రంగాల్లో తనదైన పదునైన సంభాషణలతో ప్రేక్షకలో కాన్ని అలరించిన రచయిత ఎంవిఎస్ హరనాథరావు (69) గుండెపోటుతో ఈనెల 9వ తేదీన ఒంగోలులో మృతిచెందారు. ఆయన మరణం కళాభిమానులను, కళాకారులను, సినీ రంగప్రముఖులను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. అభ్యుదయవాదిగా గుర్తింపు పొందిన హరనాథరావు ఆత్రేయ స్ధాయిలో సంభాషణలు రాసి చలన చిత్రరంగంలో రచయితగా తన స్థానం సుస్థిరం చేసుకున్నారు.

హరనాథరావు 1948 జూలై 27న గుంటూరులో మరుదూరి రంగాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే జరిగింది. తల్లి వృత్తిరీత్యా సంగీత ఉపాధ్యాయురాలు కావటంతో ఆమె ద్వారా బా ల్యంనుండే హరనాథరావుకు సంగీత సాహిత్యాలపట్ల అభిరుచి పెంపొందింది. తల్లిదండ్రులతోపాటు ఒంగోలుకు చేరుకున్న ఆయన సిఎస్‌ఆర్ శర్మా కాలేజీలో డిగ్రీ వరకు చదివారు. ఆ సందర్భంగా పలువురుతో ఏర్పడిన సహచర్యం నటుడిగా, రచయితగా ఆయన ఉన్నత స్ధితికి ఎదిగేందుకు కారణమైంది. హరనాథ రావు , కోటేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎంవిఎస్ హరనాథరావు మొదట ఒంగోలులో నీలగిరి కాఫీ, హిమగిరి విక్రయవ్యాపారాన్ని కొంతకాలం నిర్వహించారు. వ్యాపారంలో కొనసాగుతూనే రచనా వ్యాసంగాన్ని ఎంచుకున్నారు. ఆయన కలం నుంచి జాలువారిన జగన్నాథ చక్రాలు, క్షీరసాగరమథనం, కన్యావరశుల్కం, అడవిలో అక్షరాలు వంటి నాటకాలతో పాటు యక్షగానం, బూచి, లేడిపంజా, శాంతిఖడ్గం, మీపేరేమిటి, రెడ్‌లైట్ ఏరియా, రక్తబలి, కేక, నవ్వునీకు తోడుంటే, సుబ్బారావుకు కోపం వచ్చింది వంటి నాటికలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. ఆయన నాటక ప్రదర్శనలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. బూచి, లేడిపంజా నాటికలైతే హరనాథరావు తప్ప మరేవరు వాటిని ప్రదర్శించేందుకు సాహసించలేరనేంతగా ప్రసి ద్ధమయ్యాయ. నాటకరంగంలో మెరుపులు మెరిపిస్తూనే హరనాథరావు సినీరచయితగా స్ధిరపడేందుకు కృషిచేశారు. టి. కృష్ణ సహకారంతో 1985లో ఆయన సినిరంగంలోకి అడుగుపెట్టారు. టి. కృష్ణ దర్శకత్వం వహించిన పలుచిత్రాలకు ఆయన రచయితగా సహకారం అందించారు. ప్రతిఘటన, భారతనారి, ఇదా ప్రపంచం, సూత్రదారులు, స్వయంకృషి, నేటిభారతం, రేపటిపౌరులు, అమ్మాయికాపురం పలుచిత్రాలకు కథతోపాటు సంభాషణలు అందించారు. ఆరు నాటకాలు, 26నాటికలు ఆయన రచించారు. 152 చిత్రాలకు రచన సహకారం అందించటంతోపాటు, రాక్షుసుడు, స్వయంకృషి, దేవాలయం వంటి 25పైగా చిత్రాల్లో నటించారు. ఒక ప్రముఖ ఛానల్‌లో ప్రసారమైన మాయబజార్ ధారవాహిక ఆయన కలం పదును ఎలాంటిదో చాటిచెప్పింది. ప్రముఖ తమిళ హీరో శివాజీ గణేషన్ హరనాథరావు నటను ప్రశంసించటం విశేషం. నాలుగు దశాబ్దాలుగా పైగా నాటక రంగాన్ని, సినీరంగాన్ని తన రచనలతో, నటనతో ప్రభావితం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
హరనాథరావును అనేక పురస్కారాలు వరించాయి. ప్రతిఘటన చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా రాష్ట్రప్రభుత్వ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆరు నందులు ఆయన కైవసం అయ్యాయి. వీటితోపాటు ప్రతిష్టాత్మాక కందుకూరి పురస్కారం, జాలాది పురస్కారం, చెన్నై కళాసాగర్ పురస్కారం, చాట్లా పురస్కారం, పినిశెట్టి పురస్కారం, పుచ్చలపల్లి సుందరయ్య పురస్కారం, సాహిత్య అకాడమీ పురస్కారంతోపాటు పలు పురస్కారాలు ఆయనకు గౌరవం తెచ్చిపెట్టాయి. దాసరి నారాయణరావు ‘దాసరి స్వర్ణకంకణం’తో హరనాథరావును ఘనంగా సత్కరించారు. హరనాథరావు ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగాను వ్యవహరించారు. స్నేహ సమాఖ్య, అభినయ సంస్ధలను స్ధాపించి వాటి తరుపున పలు నాటకప్రదర్శనలు కూడా ఆయన నిర్వహించారు.
హరనాథరావుఅనగానే ఆయన కలం ఎంతో పదునైదో ప్రేక్షకులకు స్ఫురిస్తుంది. పలు నాటకాల్లో సినిమాల్లో ఆయన రచించిన సంభాషణలు ఆంధ్రదేశంలో వేడిపుట్టించాయి. పెనుసంచలనాన్ని కూడా కలగచేశాయి. ఆయన కలానికి అభ్యుదయ దృష్టి ఎక్కువ. ప్రజాకవి వేమన పద్యనాటకాన్ని తనదైన శైలిలో ప్రదర్శించి కళాభిమానుల మెప్పును కూడా పొందారు. సినీ, నాటక రచయితగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సంగీత, సాహిత్యాల లోతు తెలిసిన ప్రజ్ఞాశాలిగా ఆయన సినీ, నాటక రంగాలకు విశేష సేవలందించారు. అన్నింటికి మించి మనసున్న మంచిమనిషిగా ఆత్మీయత సంపన్నునిగా పేరుగడించారు. నాటకరంగ ఉన్నతికి కృషిచేయటంతోపాటు ఎంతోమంది కళాకారులను ప్రో త్సాహించారు. ఆయన మరణం కళాభిమానులకు తీరని శోకం మిగిల్చింది.

పురిణి విజయ భాస్కర్‌రెడ్డి