Others

ప్రాణాలు తీస్తున్న విద్యాసంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతూ పోవడం అత్యంత బాధాకరం. విద్యావ్యవస్థ దుస్థితికి, సామాజిక వైఫల్యానికి అద్దంపట్టే ఉదంతాలు, జరగాల్సిన పెద్ద స్థాయి సంస్కరణల అవసరాన్ని పట్టి చూపిస్తున్నాయి. పైపై ప్రకటనలు, పైపూత మందులతో ఈ దుస్థితి మార్చడం సాధ్యం కాదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విద్య వ్యాపారంగా మారి, అదే రూపంలో వ్యవస్థీకృతం అయిపోయింది. లాభార్జన మినహా మిగతా విషయాలు అప్రధానంగా మారాయి. ఏ విద్యార్థికయితే విద్యను అందించడానికి భారీ రుసుములు తీసుకుంటున్నారో ఆ విద్యార్థి బాగోగులతో సంబంధం లేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. తమ ఒప్పందం మేరకు చదువు చెప్పేస్చే చాలు బాధ్యత తీరిపోయినట్లే వ్యవహరిస్తున్నాయి. తల్లిదండ్రుల అవగాహనా లేమితోనో, తీరికలేకనో, ఫీజు కట్టేశాక అన్ని విషయాలు విద్యాసంస్థలే చూసుకోవాలనే భావనతోనో ఉదాసీనంగా ఉంటున్నారు. సరైన విద్య అందేలా పూచీపడాల్సిన ప్రభుత్వం అందుగు తగ్గ చట్టాలనూ తీసుకురాదు. కార్పొరేట్ చట్టాల్నీ దూరం చేసుకోదు. ఈ కంగాళీ క్రీడలో పరాజితుడెప్పుడూ విద్యార్థి. తామరతంపరగా ఉన్న కళాశాలలు చూస్తే బోర్డులుంటే తప్ప గుర్తుపట్టలేం. అది అపార్టుమెంటో, ఇంకొకటా అన్నది అర్థం కాదు. ఆటస్థలానికి ఒక్క గజం చోటు కూడా ఉండదు. శారీరక వ్యాయామం లేకుండా ఈ ఇతర వ్యాపకాలు లేకుండానే విద్యార్థుల జీవితాల్లో ముఖ్యమైన దశ ఆ నాలుగు గోడల మధ్యన సాగిపోతుంది. ఇక టీమ్‌స్పిరిట్, ఉద్వేగ నియంత్రణ వంటి లక్షణాలు విద్యార్థికి ఎప్పుడు అబ్బుతాయి? రోజువారీ పరీక్షలు పెట్టి, ఒంటికాలిపై నిల్చోపెట్టి ఒక్కమార్కు తగ్గినా దద్దమ్మగా ముద్ర వేసేస్తుంటే చిన్నారులకు తృప్తి, నిదానం, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి. సుకుమారంగా, మానసికంగా ఎదగవలసిన పిల్లలు ఒత్తిడికి గురై కుమిలిపోవడం మామూలైపోతోంది. పిల్లలపట్ల ప్రవర్తించివలసిన విధానం ఇదికాదు. వారు బహుముఖంగా ఎదగడానికి ఈ పరిణామాలు ఉపయోగపడవు. కార్పొరేట్ విద్యావిధానంలో నూటికి తొంబైతొమ్మిది మార్కులు వచ్చినా ఒక్క మార్కు తగ్గిపోయిందని, ఆత్మన్యూనతతో బాధపడే బేలలను తయారు చేస్తున్నాం. ఒక్కమార్కు తగ్గడం కాదు, కేవలం అరవై మార్కులే వచ్చినా ఎదగడానికి అరవై మార్గాలున్నాయన్న భరోసా, వారిలో ఆత్మబలం కలిగేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్యావిధానంలో సమూల మార్పులు అవసరం. ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయాలి. కార్పొరేట్ విద్యాసంస్కృతిని కట్టడి చేసేలా పౌరసమాజం ప్రభుత్వంపై ఒత్తిడి తేగలిగితే మన భావిభారత పౌరులను రక్షించుకున్నవారమవుతాం. సమాజం నుంచి స్పందన లేకపోతే ప్రభుత్వం ఎన్ని కమిటీలు వేసినా ఒరిగేది ఏమీ ఉండదు.

-డి.వి.జి.శంకరరావు మాజీ ఎంపి, పార్వతీపురం