AADIVAVRAM - Others

మానవ శరీరంలోకి నానో మిషన్లు?(విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్రిమ మేధస్సుతో రూపొందించిన నానో మిషన్లను మానవ శరీరంలోకి చొప్పించి వైద్యచికిత్సలు చేయడం సాధ్యమేనా? మరో ఇరవై సంవత్సరాలలో ఇది సాధ్యమేనంటున్నారు ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఐబిఎంకు చెందిన సీనియర్ ఇనె్వంటర్ జాన్ మెక్ నమర. మన శరీరంలోని కణజాలం, కండరాలు, ఎముకలను మరమ్మతు చేయడం, వృద్ధి చేయడం వంటి పనులు చేయడానికి కృత్రిమ మేధతో కూడిన నానో యంత్రాలను మానవశరీరంలోకి చొప్పించడం సాధ్యమేనన్నది ఆయన అంచనా. ఐబిఎంకు చెందిన హాంప్‌షైర్‌లోని హర్స్‌లీ ఇన్నోవేషన్ సెంటర్‌లో పనిచేస్తున్న జాన్ తన సిద్ధాంతానికి ఆధారాలతో కూడిన నివేదికను హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ కమిటీకి అందచేశారు. కృత్రిమ మేధస్సుకు సంబంధించిన పరిశోధనలకు ఆర్థిక, నైతిక, సామాజిక అంశాలపై ఆ సంస్థ పరిగణనలోకి తీసుకుని అనుమతి ఇస్తుంటుంది. వచ్చే రెండు దశాబ్దాలలో సాధించే సాంకేతిక ప్రగతి మానవులు, యంత్రాలు కలగలసిపోయేలా చేస్తుందని, మానవ ప్రగతికి ఇది పెద్ద ముందడుగుగా పరిణమిస్తుందని జాన్ అంటున్నారు. ‘్భవిష్యత్‌లో మన శరీరంలోకి నానో యంత్రాలు చొప్పించడాన్ని మనం చూస్తాం. ఇది వైద్యపరంగా అద్భుతమైన ప్రగతికి దోహదం చేస్తుంది. సాంకేతికత, జీవసంబంధిత మేళవింపుతో నేరుగా, సమర్ధవంతంగా మన ఆలోచనలను ఆవిష్కరించవచ్చునని, కృత్రిమ మేధతో కూడిన నానో యంత్రాలు శరీరంలోకి చొరబడిన తరువాత మన కంప్యూటింగ్ శక్తి విస్తృతంగా పెరుగుతుందని, ఇది సరికొత్త ఆవిష్కరణకు దారితీస్తుంది’ అని ఆయన చెబుతున్నారు. మన చుట్టుపక్కల పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేసి చక్కటి వాతావరణం నెలకొనేలా, నియంత్రించేలా మన ఆలోచనలు, వ్యవహారశైలితో సొంతంగా చేసుకోవచ్చని ఆయన అంటారు. మానవ శరీరంలోని లోపాలను గుర్తించి మరమ్మతు చేసేందుకు సంబంధించిన ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్‌ను మనిషి డిఎన్‌ఎతో రూపొందించే ప్రాజెక్టును మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రారంభించింది. మనిషి శరీరంలోని శుష్కించిన కణజాలాన్ని మళ్లీ శక్తివంతం చేసి పనిచేసేలా చూడటం ఆ కంప్యూటర్ పని. అయితే ఈ కృత్రిమ మేధో యంత్రాల రాకవల్ల చిల్లర వర్తకం, సేవల రంగాల్లో పెద్ద కుదుపునకు కారణమవుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. చాలామందికి ఉపాధి దూరమవుతుందని, పని కొరవడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్మార్ట్ఫోన్‌ను చాలామంది కొనుగోలు చేయలేకపోతున్నారు. అలాగే భవిష్యత్‌లో ఇలాంటి ఖరీదైన కృత్రిమ మేధతో కూడిన నానో యంత్రాలు అందరికీ అందుబాటులో ఉండవు. అప్పుడు సమాజంలో చెప్పలేని అసమతుల్యత ఏర్పడుతుందని ఆయన అంటున్నారు.

ఎస్.కె.కె. రవళి