Others

మన ఆహారంలో బలం ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ప్రస్తుతం మనం రెండో స్థానంలో ఉన్నాం. మరికొద్ది సంవత్సరాల్లో చైనాను తలదన్ని మనమే ఆ విషయంలో తొలి స్థానానికి చేరుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవలసి ఉంది. పౌష్ఠికాహార లోపంతో బాధపడేవారి సంఖ్యలో మన దేశం అగ్రస్థానంలో ఉంది. బలవర్థక ఆహారం అందక గర్భిణులు, నవజాత శిశువులు, ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల్లో మనదేశం మొదటి స్థానంలో ఉంది. చివరకు అతిపేద దేశాలైన ఇథియోపియా, బురుండి, ఇరుగుపొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఈ విషయంలో మెరుగైన పరిస్థితులు ఉన్నాయంటే నమ్మాలి. అలాగే మనిషి ఎదగడానికి, ఎముకల పుష్టికి కీలకమైన కాల్షియం వాడకంలోనూ మనం వెనుకబడే ఉన్నామని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. అయితే ఆసియా పసిఫిక్ దేశాలైన చైనా, ఇండోనేసియా, వియత్నాం వంటి దేశాలు కూడా మన మాదిరిగానే సగటున రోజుకు 400 మిల్లీగ్రాముల కాల్షియంను మాత్రమే తింటున్నారు. మనవాళ్లు తీసుకునే ఆహారంలో తగిన మోతాదులో కాల్షియం అందకపోవడంతో ఎముకలు విరిగిపోవడం, కీళ్ల, ఎముకల వ్యాధులబారిన పడుతున్నారని ఆ అధ్యయనం తేల్చిచెప్పింది. కాల్షియం తక్కువగా వాడే కేటగిరీలను మూడుగా విభజించి అధ్యయనం నిర్వహించారు. 400 మి.గ్రాల లోపు విభాగం మొదటిది. 400-500, 500-600 మి.గ్రా రోజుకు వాడే కేటగిరీల్లో దక్షిణ అమెరికాలోని అర్జెంటినా, బొలీవియా, బ్రెజిల్ ఆఫ్రికాలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని దేశాల ప్రజలు మనకన్నా కాస్త ఎక్కువగా కాల్షియం తీసుకుంటున్నప్పటికీ అదీ చాలినంతకాదు. అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ ఈథన్ బాల్క్ సారథ్యంలో అధ్యయన ఫలితాలను సమీక్షించారు. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో సగటు మనిషి తీసుకుంటున్న కాల్షియం ఆరోగ్యకరమైన ఎముకల నిర్మాణానికి తగ్గట్టు లేదని ఆయన ప్రకటించారు. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఉందని, అందువల్లే ఆయా ప్రాంతాలలో రోజురోజుకు ఎముకల వ్యాధులు, కీళ్లనొప్పులబారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోందని ఆయన అభిఫ్రాయపడ్డారు. ఆస్టియోపోరోసిస్ అంతర్జాతీయ జర్నల్‌లో ఈ మేరకు అధ్యయనం ఫలితాలను ప్రచురించారు. దాదాపు 74 దేశాలలో వివిధ వర్గాల ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో కాల్షియం పరిమాణం, వారు తీసుకోవలసిన పరిమాణంతో పోల్చి చూశారు. అక్కడ వివిధ పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలను పరిశీలించారు. మొత్తంమీద సమీకరించిన గణాంకాల ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చారు. దక్షిణ, తూర్పు ఆసియా దేశాలు మిగతా ప్రపంచంకన్నా అతి తక్కువగా రోజుకు సగటున 400 మి.గ్రా.ల కాల్షియంను మాత్రమే తీసుకుంటున్నారని ఆ అధ్యయనంలో తేలింది. ఇది ప్రపంచంలో అతి తక్కువ సగటు. ఉత్తర ఐరోపా దేశాలు మాత్రమే తగినంతగా, అంటే సగటున రోజుకు అక్కడి ప్రజలు వెయ్యి మిల్లీగ్రాముల మేరకు కాల్షియంను తమ ఆహారంతోపాటు తీసుకుంటున్నారు. ఇక దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలలో ప్రజలు సగటున రోజుకు 400 నుండి 700 మి.గ్రాల లోపు కాల్షియంను స్వీకరిస్తున్నారని ఆ అధ్యయనంలో తేలింది. ఇప్పటివరకు ఇలాంటి పరిశోధనలు, అధ్యయనాలు సాగని ఆసియా, పసిఫిక్ ప్రాంత దేశాల ప్రజల్లో కాల్షియం వాడకం ప్రాధాన్యత, తాము రోజు తీసుకునే ఆహారంలో కాల్షియం అందించే పదార్థాలు ఉండేలా చూసుకోవాలన్న చైతన్యం ప్రజల్లో కలిగించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆ అధ్యయనం గుర్తు చేసింది. మానవ అస్థిపంజర నిర్మాణంలో ఎముకలు కీలకం అవి తగినంత ధృడంగా లేకపోతే మనిషి రూపం మారిపోతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. నిజానికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. పాలు, గుడ్లువంటి ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి తగినంత కాల్షియం అందే అవకాశం ఉంది. సమతుల్య ఆహారం లేమితో బాధపడుతున్న వారి సంఖ్య మన దేశంలో ఎక్కువే. ఇప్పుడు కాల్షియం లేమితో బాధపడుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువేనని తేలింది. కుటుంబ, శిశు సంక్షేమశాఖ తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నిజానికి ప్రజల్లో చైతన్యం వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

-కృష్ణతేజ