Others

భూషణ దూషణలు సమానమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎ వడురా అది. పల్లకీని ఇలా మోస్తున్నది’’ అని పలికిన రాజుగారికి ‘‘మహారాజా.. ఈ కొత్తబోయి వానికి పల్లకీని మోయడం రాకున్నది. వీని వల్లనే మాకు కూడా కష్టంగా ఉంది’’అన్న జవాబు చిరాకు తెప్పించింది. మేనాలోంచి తొంగి చూసేసరికి బలిష్టమైనవాడు, మధ్యవయస్కుడు, కండలు తిరిగిన వానిగా ఉన్న ఒక బోయి పల్లకీని మోస్తున్నాడు. ఆమోయడంలో ఆసక్తి గాని, భయభక్తులు గాని కనిపించలేదు రహూగణ మహారాజుకు.
వెంటనే ఎక్కడలేని కోపం వచ్చింది. ‘ఏం బాబు నీవు చాలా ముసలివానిలాగా వున్నావు. పాపం నీ వెన్నుముక వంగినట్టు ఉంది. అందుకే నీవు ఈ పల్లకీనిమోయడానికి చాలా అవస్థలు పడుతున్నట్టున్నావు. నీవల్ల నేను కూడా కుదుపులకు కష్టపడుతున్నాను’’ అన్నాడు మహారాజు.
దానికీ సమాధానం లేదు బోయి వాని దగ్గర నుంచి మహారాజుకు చిర్రెత్తుకు వచ్చింది. నేను మహారాజును. నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడంలేదు. నేను ఎద్దేవా చేస్తే సమాధానం లేదు. అసలు విన్నట్టుగానే లేడు. కనీసం నడకలో పల్లకీ మోయడంలో కూడా ఏమాత్రం జాగ్రత్త కనబరచడంలేదు. అసలీ మనిషి ఎవరు? అని మరింత ఆవేశంతో ‘ఓ బోయి నీ శరీరం కందిపోతుందనుకొంటున్నావు. ఎన్నాళ్లు ఎంత సుఖబోగాలల్లో కూర్చుండబెట్టినా ఈ శరీరం ఒకనాటికే నశించేదే... వెన్నమీగడలు పెట్టి పెంచినట్టు ఉన్నావు. అందుకే నీకు పల్లకీ మోయడం రావడంలేదు..’’ మరింత గట్టిగా మహారాజు అన్న స్పృహ కూడా లేకుండా రహూగణుడు అరుస్తునే ఉన్నాడు.
అక్కడే ఏమి జరుగుతుందో చూడాలన్న ఆసక్తితో ఈ బోయి వాని సవితి తమ్ముళ్లు ఎదురుచూస్తున్నారు.
ఇంతలో పల్లకీ మోసేబోరుూల్లో ఒకడు ‘ఓయి నీవల్ల మహారాజు ఆగ్రహానికి మేము బలి అయ్యేట్టుగా ఉన్నాం. సరిగా అడుగులు వేయి’’ గదమాయించాడు. దానికి సమాధానమేమీ ఇవ్వకుండా ముందుకు అడుగులు వేస్తున్న వానిని తమ్ముళ్లు చూసి వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. ‘వీడు ఏమిరా దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉన్నాడు. వీనికి చెవులు పనిచేయడం లేదా.. మనం ఏదైనా అన్నా మిన్నకుండేవాడు. ఆఖరికి కాళికకు బలి ఇచ్చినా నిమ్మకున్నాడు. అసలు వీని తత్వమేమిటి’ అన్నాడు. ఈ మాటలు పల్లకీ మోసే బోయిల తోపాటుగా మహారాజు విన్నాడు. బోయిలను పల్లకీని దించమని చెప్పాడు. ఆ మాట్లాడు కొనేవారిని పిలిపించమన్నాడు.
మహారాజు ఆజ్ఞ ప్రకారం వారు వచ్చారు. ఈ మూఢునిలాగా వున్న ఈ బోయి గురించి మీకు తెలిసింది చెప్పమని మహారాజు అడిగాడు.
వారు ఇలా భయంతో జరిగింది చెబుతున్నారు..
మహారాజా.. ఇతడు మాకు సహోదరుడే. అంగీరసుడనే విప్రుడు మా తండ్రి. మా తండ్రికి ఇద్దరు భార్యలున్నారు. పెద్ద్భార్య పుత్రులు మేము తొమ్మిదిమందిమి. వీడు మా పిన్ని అంటే మా తండ్రి రెండవ భార్య పుత్రుడు ఒకడే. మా తండ్రి మాకంటే వీనిని ఎంతో గారాబంగా చూసేవాడు. మాత్రండే మాకు విద్యాబుద్ధులు నేర్పించాడు. గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించి ఉపనయనం, వేదవిద్యలు అన్నీ నేర్పించాడు. వీడు అన్నీ నేర్చుకున్నాడు. కాని దేనిని పాటించేవాడు కాడు. పాటించకుండా కూడా ఉండలేదు. వీడు జడుడు లాగా ఉండేవాడు. ఇంత నేర్పించినా నా వంశాన్ని ఉద్దరిస్తాడనుకొన్నాను. కాని వీనివల్ల నా వంశోన్నతి కలుగడంలేదు అని మాతండ్రి వాపోయేవారు. నా ప్రయత్నం అంతా వ్యర్థమయిందని మా తండ్రి భావించాడు. ఎన్నో విద్యలను నేర్చుకున్న ఇతడు దేనిపైనా ఆసక్తిని చూపేవాడు కాడు. వీని వ్యధతోటే మా తండ్రి పరలోక వాసుడయ్యాడు.
ఆ తరువాత మా తల్లి వీనిని వీని అమ్మను కూడా జాగ్రత్తగా చూసేది కాని మాతో వీడు స్నేహంగా ఉండేవాళ్ళమే కాదు. అందుకే మేము వీనిని ఆటపటించినా ఊరుకునేవాడు. ఎంత గట్టి పనులు చెప్పినా వీడు చేస్తాడు కాని నేను చేయలేను అని చెప్పేవాడే కాదు. ఒకసారి వీనికిమేము పాచిపోయిన అన్నాన్ని కూడా తినడానికి ఇచ్చాము. దానే్న తిన్నాడు కాని మారు మాట్లాడలేదు. ఇలా ఎన్నో విషయాలు బోయి వాని గురించి చెబుతున్నాడు. మహారాజు రహూగణుడు ఆసక్తిగా వింటున్నాడు.
(ఇంకా ఉంది)

- రాయసం లక్ష్మి 9703344804