Others

భక్తికే కట్టడి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతలో పక్కింటిలో రోలు తిరగవేసి దానిపై నిలబడి ఉట్టి అందుకుని వెన్న తాను తింటూ కోతులకు పెడుతున్న కృష్ణుడు యశోదమ్మ కు కనిపించాడు. వెంటనే ‘ఓరి ఇక్కడున్నావా. నీవు వస్తున్నా... మనింట్లో చేసిన అల్లరి చాలక ఇక్కడ మొదలెట్టావా... వస్తున్నా.. అంటూ ముందుకు వస్తున్నయశోదమ్మను చూచి నిజంగా భయపడుతున్నట్లు అమ్మో అన్నకేక పెడుతూ ఆ వెన్నకుండలను కిందికి దబ్బున వేసి అక్కడ్నుంచిపరుగెత్తాడు కృష్ణుడు. యశోదమ్మా ఆయన వెంటే పరుగెత్తోంది. కృష్ణుడు తన ఇంటిలోకి పరుగెత్తి స్తంభాల చాటు న దాక్కుంటూ యశోదమ్మకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎంత పరుగెత్తినా పట్టుబడని కుమారుడిని చూచి ‘ఏంచేయను... లేక లేక పుట్టినవాడని అల్లారుముద్దుగా చూసుకొంటూ ఉంటే వీని అల్లరి నా ఒక్కదానికే కాక ఊరంతా పాకుతోంది. అందరి ఇండ్ల పాలుపెరుగు మననీయకపోతే ఏలా చేయను. కట్టడి చేద్దామంటే కనుల నీరు నింపుకుని చూస్తాడు. వాని ముద్దుమోమును చూచి నేను ఏమి చేయలేకపోతున్నాను. మంచి మాటలు ఎన్నిచెప్పినా బుద్ధి గా ఊకొడతాడు కాని వాని అల్లరిని మాత్రం మానడం లేదు.. అనుకొంటూ మరలా ఫాల భాగంలో పట్టిన చిరుచెమటలను తుడుచుకుంటూ యోగుల హృదయనివాసుడైన పరమేశ్వర రూపుడిని పట్టుకొందామని పరుగులిడుతోంది ఆ యమ్మ యశోదమ్మ.
చిట్టచివరకు ఎవరికీ దొరకని వాడిని, పరమాత్మను పట్టుకొంది యశోదమ్మ. ఆమెలో ఎంతో సంతోషం వేసింది.
వెంటనే కృష్ణుని పట్టుకుని ‘ఓహో తమరు శ్రీకృష్ణులు కారా! నా కుమారులు మీరు గారా! ఎవరు మీరు. ఎవరికీ చిక్కకుండా ఉంటారట. మిమ్ముల్ను పట్టుకోవడం అంటే సాధ్యం కాదట. మీకు దొంగతనమే తెలియదట. పొరుగిండ్ల దారి తెలియదట. వారి ఇంట వెన్నమీగడలు మీరు ముట్టుకోరట. అసలు మీకు సంగడీలే లేరట. మీరెంతో మంచివారట. నిజమేనా.. ఎవరికీ దొరకక ఎక్కడకు పోతారు. క్షణం ఏమారితే ఇల్లంతా గల్లంతు చేసేస్తారు. ఏమిటీ నీ మాయ. కొండలు దొర్లిస్తానని వెళ్తారట .కాస్త కూడా భయం లేకుండా నీళ్లల్లోకి దూకేస్తారట. ఎవరినీ లెక్కచేయరట. ఏమో ఎందుకలా నాకును పట్టు పడరా ఏమిటి.. నేను అలా వదిలేస్తానా.. ఇదిగో ఇపుడు దొరికారు కదా.. ఇక మీ సంగతి చెప్తాను చూడండి.’అంటూ కృష్ణునితో మాట్లాడుతూ యశోదమ్మ కృష్ణుని రెండు చేతులు పట్టుకొని అటు ఇటూ తిరుగుతూ వెతుకుతోంది.
ఈ పిల్లవానిని కట్టడి చేయకపోతే పరువు పోతుంది. ఎలాగైనా వీనికి బుద్ధి చెప్పాల్సిందే. కొడ్తామంటే బుగ్గలు కందిపోయేలా ఏడుస్తాడు. అందుకే కాసేపు కట్టి పడేస్తే అపుడు బుద్ధి తెచ్చుకుంటాడు అనుకొని తాడుతో కడ్తామని తాడు వెతుకుతూ ఉంది. అంతలో ఆమెకు తాడు కనిపించింది. దాన్ని తీసుకొంది. అమ్మ చేసే పనులకు భయపడినట్లుగా కృష్ణుడు ‘అమ్మా.. నా మాట విను అమ్మా.. ఇంకెప్పుడూ అల్లరి చేయను. నిజంగా అల్లరి చేయను.. నీవు నన్ను వదిలిపెట్టు అమ్మా’అని బతిమాలుతూ కనులు నీరు కారుస్తూ వగరుస్తూ చూస్తున్నాడు.
* * *

- చరణ శ్రీ