Others

బొబ్బిలిపులి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు నచ్చిన చిత్రం ఎన్.టి.రామారావు, దాసరి నారాయణవుల ‘బొబ్బిలిపులి’. ఈ సినిమాని నిర్మించింది విజయమాధవీ కంబైన్స్ సారథులు వడ్డే శోభనాద్రి, వడ్డే రమేశ్, వడ్డే కిశోర్. వార్తాపత్రికలో వచ్చిన ఒక వార్త ఆధారంగా ఈ చిత్ర కథను సిద్ధం చేసుకొన్నారట. దాసరి నారాయణరావు (కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం). దేశభక్తిపరుడైన ఒక సైనికాధికారి దేశంలోపల జరుగుతున్న అక్రమాలను చూసి ఒళ్ళుమండి తిరుగుబాటు చేయడం, తన తండ్రే ఒక దేశద్రోహి అని అతడికి తెలిసినపుడు అతడేం చేశాడన్నది ఈ చలనచిత్ర ఇతివృత్తం. సినిమా కథానాయకుడికే కాదు, ప్రేక్షకులకు కూడా జరుగుతున్న కథని చూస్తూ వుంటే ఒళ్ళు మండిపోతుంటుంది. వారు పూర్తిగా సినిమాలో లీనమైపోతారు. ఈ చిత్రంలో సంభాషణలు ఎంత పదునుగా వున్నాయంటే- ఎ.సి.ఇ మ్యూజిక్ కంపెనీ, మద్రాసు గ్రామ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రై.లి. వాళ్లు డైలాగ్స్‌ని కూడా కలిపి లాంగ్ ప్లే రికార్డులుగా తీసుకువస్తే వ్యాపారంలో రికార్డులు సృష్టించాయి అవి. ‘తెల్లా తెల్లని చీరలోనా చందమామా’ పాటను ప్రదర్శించడానికి సినిమా హాల్లోని 70 ఎంఎం తెర సరిపోలేదంటే అలా చూస్తూ ఉండిపోవడానికి రెండు కళ్లూ చాలలేదంటే నమ్మండి. ఫొటోగ్రఫీ కె.ఎస్.మణి, నృత్యాలు సలీమ్, కూర్పు జి.జి.కృష్ణారావు. స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్‌లో నిర్మాణమైన ఈ చిత్రంతో జె.వి.రాఘవులు (సంగీత దర్శకుడు) మరపురారు. ఎన్.టి.రామారావు వెండితెరపైనే కాక, వెండి తెరకు వెలుపలా బెబ్బులే అయ్యారు, రాజకీయ రంగంలో ప్రవేశించి. ఇంకా ఒక్క శ్రీదేవి అనే ఏమిటి, జయచిత్ర, పుష్పలత, కైకాల సత్యనారాయణ, రావికొండలరావు, డాక్టర్ ఎం.ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్యల వంటి వారితోపాటు భీమరాజు (కారును ఫుట్‌పాత్‌మీదకు తోలింది ఇతనే), సిహెచ్.కృష్ణమూర్తి (పోలీస్ ఇన్స్‌పెక్టర్), జయవిజయ (నర్స్)ల వంటి చిన్నా చితకా పాత్రధారులు కూడా వారి అభినయంతో మనని ఆకట్టుకుని ఇంతకాలమైనా సరే (1982లో రిలీజ్ అయింది) గుర్తుండిపోతున్నారు. రీ రిలీజ్‌లోనూ ఈ బొబ్బిలిపులి ఎత్తిన పంజా దించలేదు మరి.

-కేతవరపు దిలీప్ మియాపూర్, హైదరాబాద్