Others

‘ఒళ్ళంత కవ్వింత కావాలిలే...’(నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున హీరోగా వచ్చిన ‘గీతాంజలి’ సినిమాలోని ‘ఒళ్ళంత కవ్వింత కావాలిలే’ అనే పాట ఒక జలపాతంలా అప్పుడు యువతరాన్ని ఊపేసింది. వేటూరి రచన, ఇళయరాజా సంగీతం, చిత్ర గాత్రం అన్నీ అలా కుదిరి పాటను అజరామరం చేశాయి. హీరోయిన్ గిరిజ తన ఉత్సాహం ఉరకలు వేసే నటనతో పరుగులెత్తించింది తనతోపాటు ప్రేక్షకుల్ని. ఓ పక్క ఎండ, ఓ పక్క వానలా వుంటుంది చిత్రీకరణ. స్లోమోషన్ కాసేపు, మామూలుగా కాసేపు, మధ్యలో ఎవరో చార్లీ చాప్లిన్‌ను అనుకరిస్తూ రావడం, అతనితో కలిసి డాన్స్ చేయడం- అంతా ఓ ఝురిలా సాగుతుంది. కళ్ళప్పగించి, చెవులు రిక్కించి చూస్తూండగానే పాట అయిపోతుంది. నిర్మాతల అభిరుచి, మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, ఫొటోగ్రఫీ, మ్యూజిక్, నృత్య దర్శకత్వం వేటికవే నూటికి నూరుశాతం అమిరితే ఇలాంటి పాటలే వస్తాయి. మణిరత్నం డైరెక్టుగా తెలుగులో చేసిన ఏకైక సినిమా ఇది. హీరోయిన్ పేరుతో నాగార్జున సినిమా రావడం అప్పట్లో సంచలనం. కానీ చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటికీ నెట్‌లో చూడొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఆర్కెస్ట్రాల్లో ఇప్పటికీ హాట్ ఫావరేట్ ఈ పాట.

-కాళిదాసు విజయచంద్ర, కావలి