Others

తెలుగువారికి గర్వకారణం(శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థి దశలో నాటక రంగంపై ఎవరైనా శ్రద్ధ చూపిస్తే, చదువుపై శ్రద్ధ తగ్గుతుందని పెద్దలు నిరుత్సాహపరుస్తుంటారు సహజంగా. ఉద్యోగం చేస్తూ నాటకాలలో నటించాలంటే వృత్తిపరంగా కూడా అనేక అడ్డంకులు ఏర్పడటం సహజం. కానీ ఒక ప్రక్క వృత్తి పరంగా రాణిస్తూ నాటక రంగంలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందటం అన్నది మామూలు విషయం కాదు. ఉద్యోగరీత్యా డిప్యూటీ కలెక్టర్ హోదా చేరుకొని కూడా అగ్రశ్రేణి నటుడిగా రాణించిన నటుడు జొన్నలగడ్డ వెంకట సోమయాజులు. తమ్ముడు రమణమూర్తితో స్థాపించిన నటరాజు కళాసమితి ద్వారా కాళరాత్రి, ఫణి, కన్యాశుల్కం నాటకాల ద్వారా వందలాది ప్రదర్శనలు ఇచ్చి పలు బహుమతులు పొందిన తర్వాత సినీ రంగం నుంచి అవకాశాలు రావటం ప్రారంభమైంది. కానీ సోమయాజులు మాత్రం సినిమాలలో నటించటానికి అనాసక్తి చూపారు. వర్థమాన దర్శకుడు యోగి మాత్రం సోమయాజులుని ఒప్పించి రారా కృష్ణయ్య అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటింపజేశాడు. రారాకృష్ణయ్య చిత్రం విడుదలై ఘోరంగా అపజయం పాలై సినిమా రంగంలో ఎందుకు ప్రవేశించానా అని సోమయాజులుని పదే పదే కృంగదీసింది. దీనికంటే నాటక ప్రదర్శనే మేలు, ప్రేక్షకుల స్పందన ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు- సినిమాలలో నటించి తప్పు చేసినట్లు పదే పదే బాధ వ్యక్తం చేయసాగాడు సోమయాజులు.
రోజులు గడుస్తున్నాయి. ఆఫీస్ పరిషత్ నాటకాలు రొటీన్‌గా కార్యకలాపాలు కొనసాగుతున్న రోజుల్లో దర్శకుడు కె.విశ్వనాధ్ నుంచి కబురు వచ్చింది. సోమయాజులు మాత్రం మళ్లీ సినిమాలలో నటించటానికి సమ్మతించక అనాసక్తి ప్రదర్శించసాగారు. దర్శకుడు విశ్వనాధ్ మాత్రం పట్టువిడవక పదే పదే విషయం గురించి బలవంతం చేయటం ప్రారంభించారు. ఒక చిత్రంలో నటించి పొరపాటు చేసా, మళ్లీ రెండవసారి కూడా అలాంటి పొరపాటు ఎందుకు చేయాలన్నది సోమయాజులు అభిప్రాయం. ఆఖరున విశ్వనాధ్ ప్రయత్నాలు ఫలించి సినిమాలో సోమయాజులు నటించటానికి ఒప్పించగలిగారు. ‘శంకరాభరణం’ చిత్రం ప్రారంభ దశలో మామూలు టాక్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో శంకరాభరణం సూపర్‌హిట్ టాక్ వచ్చింది. ఆ చిత్రం అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డిగారికి అమితంగా నచ్చింది. చిత్రంలో హీరో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సోమయాజులు అధినేతగా ఒక డిపార్టుమెంట్‌ను ఏర్పాటుచేసి హైదరాబాద్ కేంద్రంగా సాంస్కృతిక శాఖ ఏర్పాటుచేశారు. కాలం గడుస్తున్నకొద్దీ దేశంలోనే శంకరాభరణం చిత్రం చూడని వారు లేరంటే అతిశయోక్తి కాదు అనిపించింది. అమెరికా, యూరప్ దేశాలలో కూడా అఖండ విజయం సాధించింది. ప్రపంచ చలన చిత్ర చరిత్రలో ఒక రంగస్థల నటుడు ఒకే ఒక చిత్రం ద్వారా దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలు పొందటం కేవలం సోమయాజులుతోనే ప్రారంభమైంది. సోమయాజులు తెలుగు నటుడు కావడం తెలుగువారందరికీ గర్వకారణం.

-పర్చా శరత్‌కుమార్