Others

జంధ్యాలను స్మరిస్తూ... (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయితగా, దర్శకుడిగా జంధ్యాల తన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకోగల పాత్రల రూపకల్పనతో తనదైన ప్రత్యేక మార్కు హాస్య చిత్రాలను అందించారు. నేటికీ ఆ చిత్రాలను చూస్తూ ప్రేక్షకులు పదే పదే ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. జంధ్యాల ఆకస్మిక మృతితో సోనీ హాలీడేస్ సంస్థ ఆయన కీర్తిని చిరస్థాయిగా గుర్తుండేలా 2001లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగు సినిమా రంగంలో హాస్యనటులందరూ హాజరైన ఈ కార్యక్రమంలో జంధ్యాలను గుర్తుచేస్తూ హాస్య ప్రధాన స్కిట్స్‌తో నిర్వహించబడింది. తెలుగు హాస్యకళాకారులతోపాటు హిందీ హాస్యనటుడు జానీలివర్ ప్రత్యేక అతిథిగా హాజరై ఈ కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు. తెలుగు సినిమా హాస్యనటులతోపాటు ప్రఖ్యాత నటులు కాంతారావు, రంగనాథ్, విజయచందర్, డా. సి. నారాయణరెడ్డి, డాక్టర్ కె.వి.రమణాచారి లాంటి అగ్రశ్రేణి సాంస్కృతిక దిగ్గజాలు హాజరై జంధ్యాల జ్ఞాపకాలను స్మరిస్తూ వినోదభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారుల కదంబ కార్యక్రమంలో ఆహుతులకు బహూకరించిన జ్ఞాపిక పదే పదే జంధ్యాలను గుర్తుచేస్తూ మరింత సరదాగా కొనసాగింది. జంధ్యాలను గుర్తుచేసే సుత్తి కొట్టవద్దు జ్ఞాపికను రమణాచారికి బహూకరిస్తున్న డాక్టర్ సి.నారాయణరెడ్డిని ఈ చిత్రంలో చూడొచ్చు.

-పర్చా శరత్‌కుమార్