Others

శైలజారెడ్డి అల్లుడే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం పెళ్లి జోష్‌లో వున్న నాగచైతన్య సమంతతో కలిసి విదేశాల్లో విహరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొన్న చైతన్య తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దర్శకుడు మారుతి తెరకెక్కించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. మారుతి మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారు చేసారట. ఇంతకీ టైటిల్ ఏమిటో తెలుసా? ‘శైలజారెడ్డి అల్లుడు’. శైలజారెడ్డి పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారట. అత్త అల్లుడు సెంటిమెంట్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయెల్ ఎంపికైంది. జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.